స్వర్ణయుగ సినీ ధృవతారకు ప్రముఖుల నివాళులు !

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్‌ ఇకలేరు అనే వార్త భారతీయ సినీ పరిశ్రమను తీరని శకంలోకి నెట్టేసింది. ఆయన సమకాలీన ఎందరో తారలు వెళ్లిపోయారు. కానీ నేటి తరానికి ఆయన అప్పటి స్వర్ణయుగానికి ప్రతీకగా నిలుస్తూ వచ్చారు. కానీ, ఇప్పుడు ఆ స్వర్ణయుగం తాలూకు ధృవతార కూడా సమసిపోయింది. యావత్తు సినీ లోకం ఆయనకు సంతాపం ప్రకటిస్తోంది. అయితే దిలీప్ కుమార్ గొప్పతనం నేటి కుర్రకారుకు ఎలా చెప్పాలి ? ఆయన తన నటనతో కొన్ని సంవత్సరాల […]

Written By: admin, Updated On : July 7, 2021 12:12 pm
Follow us on

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్‌ ఇకలేరు అనే వార్త భారతీయ సినీ పరిశ్రమను తీరని శకంలోకి నెట్టేసింది. ఆయన సమకాలీన ఎందరో తారలు వెళ్లిపోయారు. కానీ నేటి తరానికి ఆయన అప్పటి స్వర్ణయుగానికి ప్రతీకగా నిలుస్తూ వచ్చారు. కానీ, ఇప్పుడు ఆ స్వర్ణయుగం తాలూకు ధృవతార కూడా సమసిపోయింది. యావత్తు సినీ లోకం ఆయనకు సంతాపం ప్రకటిస్తోంది.

అయితే దిలీప్ కుమార్ గొప్పతనం నేటి కుర్రకారుకు ఎలా చెప్పాలి ? ఆయన తన నటనతో కొన్ని సంవత్సరాల పాటు భారతీయ సినీ సామ్రాజ్యాన్ని ఏలిన నిజమైన సూపర్ స్టార్ అని నాలుగు మాటలతో చెప్పడం ఎలా సాధ్యం అవుతుంది!. దిలీప్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ప్రధానితో పాటు సినీ దిగ్గజాలు కూడా సోషల్‌ మీడియా వేదికగా ట్వీట్లు చేశారు.

‘సినిమా ఇండస్ట్రీలో దిలీప్‌ కుమార్‌ ఒక లెజెండ్‌. ఆయనలోని నటనాకౌశలం, తేజస్సు ఎన్నో సంవత్సరాలపాటు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేసిన విషయాన్ని మనం ఎలా మర్చిపోగలం. ఆయన మరణం సినీ లోకానికి, సాంస్కృతిక ప్రపంచానికి ఎప్పటికీ తీరని లోటుగానే ఉండిపోతుంది. దిలీప్ కుమార్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ – నరేంద్రమోదీ

‘భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరైన దిలీప్‌కుమార్‌ మృతితో సినీ పరిశ్రమలో ఒక శకం ముగిసింది. ఆయన ఒక సినీ సంస్థ, సినీ సంపద. కొన్నేళ్లపాటు తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్న లెజెండ్‌ మృతి బాధకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ – చిరంజీవి

‘భారతీయ సినీ పరిశ్రమ విలువను పెంచిన దిగ్గజ నటుడు దిలీప్‌ కుమార్‌. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు అద్భుతమైనవి. అలాగే అనిర్వచనీయమైనవి. దిలీప్ కుమార్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ – ఎన్టీఆర్‌

‘వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరమైన జీవితంలోనూ దిలీప్‌కుమార్‌ సర్‌ తో నాకెన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. ఆయన అకాల మరణం నన్ను కలచివేస్తోంది. సినిమా రంగానికి ఆయనో నిధి, టైమ్‌లెస్‌ యాక్టర్‌. ఆయన మరణ వార్తతో నా హృదయం ముక్కలైంది’ – అజయ్‌దేవ్‌గణ్‌

‘వెండితెర మీద హీరో ఎలా ఉండాలో చూపించిన మొదటి భారతీయ కథానాయకుడు. హీరోకి ఒక ప్రత్యేకమైన శైలిని సృష్టించిన మహానటుడు. మొట్టమొదటి సినీ నక్షత్రం దిలీప్‌కుమార్‌. ఇక శాశ్వతంగా మిగిలిపోయారు’ – సాయి మాధవ్‌ బుర్రా

‘ఈ ప్రపంచానికి చాలామంది హీరోలై ఉండొచ్చు. దిలీప్‌కుమార్‌ సర్‌ మాలో స్ఫూర్తి నింపిన గొప్ప హీరో. సినీ పరిశ్రమకు చెందిన ఒక శకం ఆయనతో ముగిసిపోయింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి’ – అక్షయ్‌కుమార్‌