https://oktelugu.com/

RRR Trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ మీద సినీ ప్రముఖుల స్పందన.. రాజమౌళికి ‘టేక్ ఏ బౌ’..

RRR Trailer: దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. తెలుగులో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇక వరుస అప్డేట్ లతో ఈ సినిమాపై మరిన్ని […]

Written By:
  • Shiva
  • , Updated On : December 9, 2021 / 03:27 PM IST
    Follow us on

    RRR Trailer: దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. తెలుగులో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

    RRR Trailer

    ఇక వరుస అప్డేట్ లతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తున్నాడు జక్కన్న. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న థియేటర్స్ లో విడుదల చేయబోతున్న సందర్భంగా ఇప్పటి నుండే ప్రమోషన్స్ లో వేగం పెంచేశారు మేకర్స్. ఇప్పటికే విడుదల అయినా పోస్టర్స్, గ్లిమ్స్, పాటలు ఈ సినిమాను మరొక లెవల్ లోకి తీసుకు వెళ్లాయి. తాజాగా ఈ రోజు ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదల అయ్యింది.

    ఈ ట్రైలర్ చూసిన ప్రతి ప్రేక్షకుడికి గూస్ బంప్స్ వస్తున్నాయి. సాధారణ ప్రేక్షకులే కాదు ఈ ట్రైలర్ చూసిన ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఈ ట్రైలర్ పై స్పందించారు. ఈ ట్రైలర్ చూసిన డైరెక్టర్ క్రిష్.. అద్బుతమైన ఎలివేషన్స్, మనసుని హత్తుకునే భావోద్వేగాలతో ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ అద్భుతంగా ఉంది.. ఈ మేజిక్ ను వెండితెర మీద చూసేందుకు ఆతృతగా ఉంది అని తెలిపారు.

    Also Read: ఎందుకు అన్నీ బూతులు ? ఫ్యామిలీ నెటిజన్ల కామెంట్లు !

    హీరో విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. ఈ ట్రైలర్ చూస్తే గర్వంగా ఉంది.. వేరే లెవల్ అంటూ వ్యాఖ్యానించారు. అనిల్ రావిపూడి.. మా ఊహలకు మించి ఈ ట్రైలర్ రూపొందింది.. మన తారక్, చరణ్ అదర గొట్టారు.. రాజమౌళి సార్.. మైండ్ బ్లోయింగ్ విజన్ అంటూ చెప్పుకొచ్చారు. టేక్ ఏ బౌ రాజమౌళి.. ట్రైలర్ అదిరిపోయింది అని గోపీచంద్ మలినేని తెలిపారు.

    డైరెక్టర్ బాబీ.. రోమాలు నిక్కబొడుచు కుంటున్నాయి.. ట్రైలర్ ఆద్యంతం సర్ప్రైజ్ లతో నిండిపోయింది అని తెలిపాడు. ఇక బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ స్పందిస్తూ.. రాజమౌళి సార్.. ట్రైలర్ చూస్తుంటే మతిపోతుంది.. తారక్, చరణ్, అజయ్ దేవగన్, ఆలియా భట్ తో పాటు మొత్తం చిత్ర యూనిట్ కి నా అభినందనలు అని చెప్పుకొచ్చారు. ఇలా ఇంకా చాలా మంది ప్రముఖులు ఈ ట్రైలర్ పై స్పదించారు.

    Also Read: Kollywood: తమిళ ఇండస్ట్రీలో మరో విషాదం… రోడ్డు పక్కన అనాథ శవంలా ప్రముఖ దర్శకుడు

    Tags