https://oktelugu.com/

సినీ ప్రముఖుల ఎమోషనల్ మెసేజ్ లు !

ప్రముఖ సీనియర్‌ సినీ జర్నలిస్ట్‌, నిర్మాత, పీఆర్వో ‘బీఏ రాజు’ మృతి పట్ల యావత్తు సినీ పరిశ్రమ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఎందరో సినీ ప్రముఖులు బీఏ రాజుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్‌ మీడియా వేదికగా సంపాతం తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘బీఏరాజు’ గురించి పోస్ట్ చేస్తూ ‘బీఏరాజు.. ఈ పేరు తెలియని వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఉండరు. మద్రాసులో ఉన్నప్పుడు సినీ పరిశ్రమకు సంబంధించిన ఎన్నో విశేషాల్ని ఆయన నాతో పంచుకునేవారు. ప్రతి […]

Written By: , Updated On : May 22, 2021 / 01:01 PM IST
Follow us on

BA Raju
ప్రముఖ సీనియర్‌ సినీ జర్నలిస్ట్‌, నిర్మాత, పీఆర్వో ‘బీఏ రాజు’ మృతి పట్ల యావత్తు సినీ పరిశ్రమ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఎందరో సినీ ప్రముఖులు బీఏ రాజుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్‌ మీడియా వేదికగా సంపాతం తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘బీఏరాజు’ గురించి పోస్ట్ చేస్తూ ‘బీఏరాజు.. ఈ పేరు తెలియని వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఉండరు. మద్రాసులో ఉన్నప్పుడు సినీ పరిశ్రమకు సంబంధించిన ఎన్నో విశేషాల్ని ఆయన నాతో పంచుకునేవారు. ప్రతి కొత్త విషయాన్ని ఆయన నుంచి తెలుసుకునేవాడిని. నా సినిమా షూటింగ్స్‌ జరిగే లొకేషన్స్‌కి సైతం ఆయన వచ్చి నాతో సరదాగా ముచ్చటించేవారు. నేను నటించిన ఎన్నో సినిమాలకు ఆయన పీఆర్‌వోగా వ్యవహరించారు. సినిమాల సమస్త సమాచారం.. ఎన్నో సంవత్సరాల క్రితం విడుదలైన క్లాసిక్స్‌కి సంబంధించిన కలెక్షన్స్‌, ట్రేడ్‌ రిపోర్ట్‌ రికార్డుల గురించి చెప్పగల గొప్ప నాలెడ్జ్‌ బ్యాంక్‌ ఆయన. ఏ సినిమా ఏ తేదీన విడులయ్యింది..? ఎంత వసూలు చేసింది? ఏ సెంటర్‌లో ఎన్నిరోజులు ఆడింది.. 100 రోజులు, 175 రోజులు, 200 రోజులు అంటూ ప్రతిదీ పరిశ్రమకు ఎన్‌సైక్లోపిడియాలా సమాచారం అందించేంత గొప్ప పత్రికా జర్నలిస్ట్‌.. మేధావి.. సూపర్‌హిట్‌ సినీ మ్యాగజైన్‌ కర్త, అనేక సినిమాల సక్సెస్‌లో కీలకపాత్ర పోషించిన బీఏ రాజుగారు లాంటి వ్యక్తి ఉండడం పరిశ్రమ అదృష్టం. అలాంటి వ్యక్తి నేడు లేరు! అన్న వార్త విని షాక్‌కి గురయ్యాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని.. కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను’ అని చిరు మెసేజ్ చేశారు.

తమిళ హీరో కార్తి ట్వీట్ చేస్తూ.. ‘నేను యాక్టర్ గా ఫస్ట్ టైమ్ హైదరాబాద్‌ కి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకూ బీఏరాజు గారు నాతో ఉన్నారు. ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ, ఎంతో అండగా ఉండే వ్యక్తి ఆయన. ఇక పై ఆయన మన మధ్య లేరనే నిజాన్ని తీసుకోవడం ఎంతో కష్టంగా ఉంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’ అంటూ కార్తి మెసేజ్ చేయగా, ‘37 సంవత్సరాలుగా బీఏరాజు నా ఫ్రెండ్, నాకు మంచి ఆప్తుడు. ఇక పై బీఏరాజును ఎంతో మిస్‌ అవుతాను. ఆయన మరణం తెలుగు ఇండస్ట్రీకి పెద్ద లోటు’ అంటూ నాగార్జున పోస్ట్ చేశారు.

అలాగే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్పందిస్తూ ‘బీఏ రాజు… నువ్వు లేని తెలుగు సినీ మీడియా, పబ్లిసిటీ… ఎప్పటికీ లోటే. తరతరాలుగా నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించిన సేవలు కలకాలం గుర్తుండిపోతాయి. నీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు రాఘవేంద్రరావు. సమంత కూడా ఎమోషనల్ అవుతూ ‘నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి. నా మొదటి సినిమా నుంచి ఇప్పటివరకూ ప్రతి ప్రాజెక్ట్‌.. అది హిట్టైనా ఫ్లాపైనా ఆయన ఎంతో సపోర్ట్‌ అందించేవారు. రాజుగారి మరణం ఎప్పటికీ తీరని లోటు’ అంటూ సమంత పోస్ట్ చేసింది. దర్శకుడు క్రిష్ ట్వీట్ చేస్తూ.. ‘బీఏ రాజు మరణ వార్తతో ఎంతో కలత చెందాను. నా బాధను చెప్పడానికి మాటలు కూడా కరవయ్యాయి. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. అలాగే, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అని క్రిష్‌ ‘బీఏ రాజు’తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.