K Viswanath: సినిమా పరిశ్రమలో పుకార్లు సర్వసాధారణమైన విషయాలు. అయితే, కొందరి ప్రముఖుల పై వచ్చే పుకార్లు వాస్తవ రూపాలుగా చలామణి అవుతాయి. వాటిల్లో ఏ మాత్రం నిజానిజాలు లేకపోయినా వాటిని నిజం అనుకుంటారు. అలాంటి పుకారు ఒకటి కళాతపస్వి పై కూడా వచ్చింది. ప్రముఖ సినీ దర్శకులు విశ్వనాధ్ గారికి బ్రాహ్మణ కుల ఫీలింగ్ ఎక్కువట కదా.. అంటూ గత ముప్పై ఏళ్ల నుంచి ఓ గాసిప్ వినిపిస్తూ వచ్చింది.

ఇదే అంశంపై ఆయన తాజాగా వివరణ ఇచ్చారు. అలాంటి ఫీలింగ్ తో గొప్ప కథలను సమర్ధవంతంగా తెరకెక్కించలేం. నిజానికి అలాంటి భావన నాకు ఎప్పుడూ లేదు. కానీ జనం నిత్యం ఎన్నో విషయాలు మాట్లాడుకుంటారు. మాట్లాడుకోకపోతే వాళ్లకు ఏమి తోచదు. కాబట్టి.. వాళ్ళ కాలక్షేపం కోసం నా పై కూడా అనేక కథనాలు పుట్టించారు’ అంటూ విశ్వనాధ్ చెప్పుకొచ్చారు.
నిజమే.. ఈ పుకారు నిజంగా నిరర్ధకం. విశ్వనాధ్ సినిమాలు ఒకసారి చూస్తే.. సప్తపది, శంకరాభరణం, స్వయంకృషి, ఆపద్బాంధవుడు ఇలా అన్నీ సినిమాలలో అన్నీ కులాలకు సంబంధించిన పాత్రలను, నటీనటులను ఆయన తీసుకున్నారు. ఇక నేరము – శిక్ష సినిమాలో కృష్ణ హీరో. కృష్ణ బ్రాహ్మణ వ్యక్తి కాదు కదా. అలాగే శరత్ బాబు ఆయన సినిమాలు అన్నిట్లోనూ ఉండేవాడు. అలాగే సాక్షి రంగారావు గారు కూడా.
వాళ్ళు ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు కాదు కదా. పైగా అన్నీ కులాల వ్యక్తులతో విశ్వనాధ్ గారు సినిమాలు తీస్తే ఆయన పై కుల ముద్ర వేయడం బాధాకరమైన విషయం. అసలు ఏ సినిమా అయినా సరే, కేవలం ఆ కులం వారు, లేక ఆ హీరో అభిమానులు చూస్తేనే హిట్ అవ్వదు. అయినా ఒక్క కులాన్ని నమ్ముకుని ఉండి ఉంటే.. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడో పోయేది.
Also Read: F3: సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ఎఫ్3.. క్లారిటీ ఇచ్చిన వెంకి
అయినా, విశ్వనాధ్ గారి సినిమా పాయింట్లు చూస్తే.. ఆయనకు కుల పిచ్చి ఉందో లేదో తేలిపోతుంది. సప్తపది సినిమాలో హరిజన వ్యక్తికి తన మనుమడి భార్యని ఇచ్చి పెళ్లి చేస్తాడు ఓ బ్రాహ్మణుడు. అలాగే శంకరాభరణంలో వేశ్యని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాడు. ఆపద్బాంధవుడు సినిమాలో కూడా కులం పై ఘాటుగా చెప్పించారు. అలాంటి ఆయన పై కుల పిచ్చి అని ముద్ర వేయడం కచ్చితంగా తప్పే.
Also Read: Preetham Jukalker: చిరంజీవి కూతురు ఫొటోకు సమంత స్టైలిష్ట్ ప్రీతమ్ కామెంట్.. నెటిజన్ల షాక్