https://oktelugu.com/

Rajamouli: రాజమౌళి పై కేసులు.. ఇది ఆశ్చర్యకరమైన విషయమే !

Rajamouli: విజువల్ డైరెక్టర్ గా తనకంటూ వందల కోట్ల మార్కెట్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న రాజమౌళి పై ప్రస్తుతం ఓ కేసు నమోదు అయింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో అల్లూరి సీతారామరాజు చరిత్రను రాజమౌళి వక్రీకరించాడని, అందుకే సినిమా మేకర్స్‌ పై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు అల్లూరి యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు వీరభద్రరావు చెప్పుకొచ్చారు. తెల్లవారిపై పోరాడిన అల్లూరిని బ్రిటీష్‌ పోలీసుగా చూపడం దారుణమని ఆయన తెలిపారు. అలాగే అల్లూరి యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు […]

Written By:
  • Shiva
  • , Updated On : January 19, 2022 / 09:53 AM IST

    SS Rajamouli

    Follow us on

    Rajamouli: విజువల్ డైరెక్టర్ గా తనకంటూ వందల కోట్ల మార్కెట్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న రాజమౌళి పై ప్రస్తుతం ఓ కేసు నమోదు అయింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో అల్లూరి సీతారామరాజు చరిత్రను రాజమౌళి వక్రీకరించాడని, అందుకే సినిమా మేకర్స్‌ పై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు అల్లూరి యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు వీరభద్రరావు చెప్పుకొచ్చారు. తెల్లవారిపై పోరాడిన అల్లూరిని బ్రిటీష్‌ పోలీసుగా చూపడం దారుణమని ఆయన తెలిపారు.

    Rajamouli

    అలాగే అల్లూరి యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు వీరభద్రరావు మాట్లాడుతూ.. ‘అల్లూరి, కొమురం భీమ్‌లు కలిసినట్లు చరిత్రలో లేదు. అల్లూరి చరిత్రను వక్రీకరిస్తూ తెరకెక్కించిన ఘట్టాలను తొలగించాలి. ఇది మా డిమాండ్‌’ అంటూ ఆయన కాస్త ఘాటుగానే హెచ్చరించారు. అయితే, ఈ సినిమా కథ కేవలం కల్పితం మాత్రమే అంటూ , రాజమౌళి మొదటి నుంచి చెబుతూనే వస్తున్నాడు. అయినా ఇలా జక్కన్న పై కేసులు నమోదు అవుతుండటం ఆశ్చర్యకరమైన విషయమే.

    Also Read:  ధనుష్-ఐశ్వర్య విడాకులకు ఆ ఇద్దరు హీరోయిన్లే కారణమా?

    ఇక పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ మరో వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అనగా విడుదల వాయిదా పడింది. మరి మళ్ళీ ఎప్పుడు విడుదల ? ఎప్పుడు అనేది ఎవరూ చెప్పలేని పరిస్థితి ? ఒకవేళ చెప్పినా ఎవ్వరూ నమ్మలేని స్థితి. ఎందుకంటే.. ఇప్పటికే ఎన్నో సార్లు ఆర్ఆర్ఆర్ వాయిదా వేయాల్సి వచ్చింది. అందుకే, స్వయంగా రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి మరో కొత్త రిలీజ్ డేట్ అంటూ ఎనౌన్స్ చేసినా నమ్మే అవకాశం తక్కువ.

    కానీ, సినిమా రిలీజ్ కి రెండు నెలలు ముందే కొత్త డేట్ ఫిక్స్ చేయాలి. అలా చేస్తే, జనం నమ్ముతారా ? ఇప్పటికే విసిగిపోయిన జనం.. ఈ సారి రిలీజ్ డేట్ కే ఖఛ్చితంగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవుతుందని గుడ్డిగా నమ్ముతారా ? నమ్మకపోతే.. నమ్మించేది ఎలా ? ఇదే ఇప్పుడు రాజమౌళికి ఉన్న అతి పెద్ద ఛాలెంజ్.

    Also Read: రుద్రాణికి షాకింగ్ వార్నింగ్ ఇచ్చిన డాక్టర్ బాబు.. ప్రమాదం నుంచి బయటపడ్డ కార్తీక్!

    Tags