https://oktelugu.com/

Nandamuri Balakrishna: వైరల్ అవుతున్న బాలయ్య ‘మంగళవారం మెనూ’ వీడియో !

Nandamuri Balakrishna:  బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షో ‘ఆహా’లోనే రికార్డ్ స్థాయిలో హిట్ అయింది. ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ అంటూ బాలయ్య తన హోస్టింగ్ తో తెలుగు ప్రజలకు ఎంతగానో అలరించాడు. అయితే, 10 ఎపిసోడ్స్ తో ఈ ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ షో ఫస్ట్ సీజన్ కి ఎండ్ పడబోతోంది. ఇక రీసెంట్‌గా బాలయ్య ‘మంగళవారం మెనూ’ పేరుతో వచ్చిన ఓ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. ‘ఆహా’ టీం ‘బాలయ్య+కుక్=విందు భోజనం’ అంటూ […]

Written By: , Updated On : January 19, 2022 / 09:37 AM IST
Follow us on

Nandamuri Balakrishna:  బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షో ‘ఆహా’లోనే రికార్డ్ స్థాయిలో హిట్ అయింది. ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ అంటూ బాలయ్య తన హోస్టింగ్ తో తెలుగు ప్రజలకు ఎంతగానో అలరించాడు. అయితే, 10 ఎపిసోడ్స్ తో ఈ ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ షో ఫస్ట్ సీజన్ కి ఎండ్ పడబోతోంది. ఇక రీసెంట్‌గా బాలయ్య ‘మంగళవారం మెనూ’ పేరుతో వచ్చిన ఓ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. ‘ఆహా’ టీం ‘బాలయ్య+కుక్=విందు భోజనం’ అంటూ స్టార్ట్ అయిన ఈ వీడియో నిజంగానే అదిరిపోయింది.

Nandamuri Balakrishna

Nandamuri Balakrishna

ముఖ్యంగా ఈ వీడియోలో బాలయ్య తనదైన శైలిలో ఫుడ్ మెనూ చెప్పారు. అందుకే ఇది ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అన్నట్లు ఆ షోకి మహేష్ బాబు ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఆల్ రెడీ మహేష్ తో ఆ ఎపిసోడ్ ను షూట్ చేశారు. అది త్వరలోనే స్ట్రీమ్ కానుంది. పైగా అదే చివరి ఎపిసోడ్ అని గత కొన్ని రోజులుగా ఇదే హాట్ టాపిక్ అయింది. అయితే, అదే నిజం అని ఆహా సంస్థ కూడా క్లారిటీ ఇచ్చింది.

Also Read: సాయి పల్లవిని స్టార్ హీరోయిన్ కానివ్వరా… చెల్లి చెల్లి అంటూ ఈ గోలేంటి?

ఇక ఈ ఎపిసోడ్ లో మహేష్ మనసు విప్పి మాట్లాడాడు అట. అలాగే మహేష్ గతంలో ‘బసవతారకం క్యాన్సర్ ఫౌండేషన్ కి కొంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చాడు. ఆ విషయాన్ని బాలయ్య ప్రస్తావించారు అని తెలుస్తోంది. ఆ సమయంలో బాలయ్యతో మహేష్ తన సేవా కార్యక్రమాల గురించి ప్రముఖంగా ప్రస్తావించారట. మొత్తమ్మీద బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షోలో మహేష్ బాబు చివరి గెస్ట్ అన్నమాట.

Also Read:రుద్రాణికి షాకింగ్ వార్నింగ్ ఇచ్చిన డాక్టర్ బాబు.. ప్రమాదం నుంచి బయటపడ్డ కార్తీక్!

Tags