Rajamouli: రీసెంట్ గానే హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరిగిన #Globetrotter ఈవెంట్ లో రాజమౌళి(SS Rajamouli) విడుదల చేసిన గ్లింప్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. మహేష్ బాబు(Superstar Mahesh Babu) తో ఆయన చేస్తున్న చిత్రం పేరు ‘వారణాసి'(Varanasi Movie) అని, ఇది పూర్తిగా ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే సినిమా అయినప్పటికీ, రామాయణం కి లింక్ ఉండే సినిమా అని, గత 60 రోజులుగా ఆ సీక్వెన్స్ కి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించామని, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు VFX వర్క్ పూర్తి కాకుండా, RAW కాపీ ని చూసినప్పుడే రోమాలు నిక్కపొడుచుకున్నాయని, ఇక ఫైనల్ ప్రోడక్ట్ రెడీ అయ్యాక ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు అంటూ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు ఈ సినిమా పై అంచనాలు మరింత పెంచేలా చేసింది.
కానీ రాజమౌళి దేవుడిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కొన్ని ఇప్పుడు వివాదాలకు దారి తీసింది. LED స్క్రీన్ పై గ్లింప్స్ వీడియో సరిగా ప్లే అవ్వలేదని దేవుడు మీద నాకు నమ్మకం లేదు, హనుమంతుడు ని మా నాన్న, నా భార్య బాగా నమ్ముతారు, ఇప్పుడు ఆ హనుమంతుడు మీద నాకు కోపం వస్తుంది అంటూ రాజమౌళి చేసిన కామెంట్స్ పై నెటిజెన్స్ ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. మన ఇండియన్ సినిమాకు ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టిన రాజమౌళి నుండి ఇలాంటి కామెంట్స్ వస్తాయని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఆయన స్థాయి కి తగ్గ మాటలు కావు ఇవి. దీంతో రాష్ట్రీయ వానరసేన అస్సోసియేషన్ నేడు రాజమౌళి పై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఇది ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.
దేవుడి పై సినిమా చేసి డబ్బులు సంపాదించుకుంటూ, దేవుడి పైనే ఇలాంటి కామెంట్స్ చేయడం ఏ మాత్రం సరికాదని, రాజమౌళి కి అసలు ఈ సినిమా తెరకెక్కించే హక్కే లేదని, మా మనోభావాలు దెబ్బ తీసినందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు. ఈ అంశం రాబోయే రోజుల్లో చాలా పెద్దది అయ్యేట్టు ఉంది. మరి రాజమౌళి దీనిపై స్పందిస్తాడా?, క్షమాపణలు చెప్తాడా?, లేదా చూసి చూడనట్టు ఈ అంశాన్ని పట్టించుకోకుండా ఉంటాడా అనేది చూడాలి. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2027 శ్రీ రామ నవమి సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి అప్పటి లోపు షూటింగ్ పూర్తి అవుతుందా లేదా అనేది చూడాలి.