https://oktelugu.com/

Bollywood: చిక్కుల్లో విక్కీ కౌశల్ – కత్రీనా కైఫ్ ల పెళ్లి… కేసు నమోదు

Bollywood: బాలీవుడ్ నటీనటులు ఇటీవల ఒక్కొక్కరిగా పెళ్లి పీటలెక్కుతున్నారు. తాజాగా బాలీవుడ్ లో లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్ – కత్రీనా కైఫ్ ల పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి. కానీ విక్కీ కౌశల్, కత్రీనా కైఫ్ లు మాత్రం దీనిపై స్పందించట్లేదు. ఈ తరుణంలో కాగా డిసెంబరు 9న వీరిద్దరు రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ డిస్ట్రిక్ట్‌లోని సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనున్నట్లు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 7, 2021 / 01:52 PM IST
    Follow us on

    Bollywood: బాలీవుడ్ నటీనటులు ఇటీవల ఒక్కొక్కరిగా పెళ్లి పీటలెక్కుతున్నారు. తాజాగా బాలీవుడ్ లో లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్ – కత్రీనా కైఫ్ ల పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి. కానీ విక్కీ కౌశల్, కత్రీనా కైఫ్ లు మాత్రం దీనిపై స్పందించట్లేదు. ఈ తరుణంలో కాగా డిసెంబరు 9న వీరిద్దరు రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ డిస్ట్రిక్ట్‌లోని సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనున్నట్లు సమాచారం. ఇక ఈ నేపథ్యంలోనే ఈ కాబోయే దంపతులకు పలువురు స్థానికులు షాక్ ఇచ్చారు. కత్రినా- విక్కీలపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాజస్థాన్ లో క్యాట్- విక్కీల పెళ్లి వేదిక వద్దకు వెళ్లాలంటే ప్రఖ్యాతి గాంచిన చౌత్ మాత మందిర్ ని వైపు నుంచి వెళ్లాల్సి వస్తోంది. అందుకని ఆ మందిర్ ని మూసివేశారట ఈవెంట్ నిర్వాహకులు… దీంతో అక్కడి స్థానికులు వీరిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారట.

    తమను మాత మందిర్ కి వెళ్లకుండా మార్గమధ్యంలో వారు అడ్డుకున్నారని, మందిర్ ని మూసివేయడానికి వారెవ్వరని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పెళ్లి కోసం అమ్మవారి గుడిని మూసివేయడ మేంటని వారు ప్రశ్నిస్తున్నారు. కాగా విక్కీ- క్యాట్ ల పెళ్లి చాలా భద్రతా నియమాల మధ్య జరుగుతుండడంతో ఈ విధంగా చేసినట్లు ఈవెంట్ నిర్వాహకులు తెలిపారని అంటున్నారు. మరి ఈ విషయమై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో తెలియాల్సి ఉంది. కాగా వీరి పెళ్లిని ఓటిటిలో లైవ్ స్ట్రీమ్ చేయాలని కొన్ని ఓటిటి సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం ఓ ఓటిటి సంస్థ ఏకంగా 100 కోట్ల డీల్ ని విక్కీ కత్రీనాలకు ఆఫర్ చేసినట్టు సమాచారం. దీంతో ఈ పెళ్లికి హాజ‌ర‌య్యేవారు సెల్ఫీలు తీయ‌డం, సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం నిషిద్ధ‌మ‌ని చెబుతున్నారు.