https://oktelugu.com/

Captain Chalapati Choudhary : ఎన్టీఆర్ పై అభిమానం.. నూతన్ ప్రసాద్ తో సాన్నిహిత్యం !

Captain Chalapati Choudhary: సీనియర్ నటుడు కెప్టెన్ చలపతి చౌదరి ఇక లేరు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కర్ణాటక రాయ్ చూర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 67 సంవత్సరాలు. చలపతి చౌదరి స్వస్థలం విజయవాడే. ఆయన విజయవాడలోనే పుట్టి పెరిగారు. అయితే, ఎదిగిన తర్వాత రాయచూర్‌లో చలపతి చౌదరి కుటుంబంతో సహా స్థిరపడ్డారు. నటన పై ఆయనకు చిన్నప్పటి నుంచి ఆసక్తి. అందుకే, […]

Written By:
  • Shiva
  • , Updated On : May 20, 2022 / 07:31 PM IST
    Follow us on

    Captain Chalapati Choudhary: సీనియర్ నటుడు కెప్టెన్ చలపతి చౌదరి ఇక లేరు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కర్ణాటక రాయ్ చూర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 67 సంవత్సరాలు. చలపతి చౌదరి స్వస్థలం విజయవాడే. ఆయన విజయవాడలోనే పుట్టి పెరిగారు. అయితే, ఎదిగిన తర్వాత రాయచూర్‌లో చలపతి చౌదరి కుటుంబంతో సహా స్థిరపడ్డారు.

    Captain Chalapati Choudhary

    నటన పై ఆయనకు చిన్నప్పటి నుంచి ఆసక్తి. అందుకే, చిన్న తనంలో చలపతి నాటకాల్లో నటించారు. ఎన్టీఆర్ అంటే ఆయన ఎంతో అభిమానం. ఎన్టీఆర్ పై అభిమానంతోనే ఆయన సినిమాల్లోకి వచ్చారు. అలాగే, ప్రముఖ నటుడు నూతన్ ప్రసాద్ తో కూడా ఆయనకు మంచి పరిచయం ఉంది. చిన్నప్పుడు స్కూల్‌లో నూతన్ ప్రసాద్ ఆయనకు సీనియర్.

    Also Read: Telangana BJP: బీజేపీ నేతల పర్యటనల వెనుక ఆంతర్యమేమిటో?

    స్కూల్ లో నూతన్ ప్రసాద్ నాటకాలు వేస్తుండే వారు. అలా చలపతి చౌదరి గారికి కూడా నాటకాల పై ఆసక్తి కలిగింది. కొన్ని నాటకాల్లో కూడా ఆయన నటించారు. ఇక తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో కలిపి వందకు పైగా సినిమాల్లో ఆయన నటించారు. చిరంజీవి, శివరాజ్‌ కుమార్‌, బాలకృష్ణ వంటి పలు స్టార్‌ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించారు.

    Chalapati Choudhary

    అలాగే బుల్లితెరపై ప్రసారమయ్యే పలు సీరియల్స్‌లోనూ చలపతి చౌదరి కనిపించారు. ముఖ్యంగా నెం.1 కోడలు సీరియల్ లో ఆయనది కీలక పాత్ర. ఇక చలపతి చౌదరి గారికి తెలుగు భాష అంటే ఎంతో ప్రేమ. ఎక్కువగా తెలుగు భాషలోనే ఆయన స్పష్టంగా మాట్లాడేవారు. కెప్టెన్ చలపతి చౌదరి మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.

    మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున చలపతి చౌదరి గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

    Also Read: Hero Daughter With Delivery Boy: ‘డెలివరీ బాయ్స్’తో హీరోగారి కూతురు డ్రామాలు.. ఇది మాములు రచ్చ కాదు !
    Recommended Videos


    Tags