Bigg Boss 7 Telugu: స్పై బ్యాచ్ చేతిలో చిత్తైన కెప్టెన్ అమర్ దీప్… అది మామూలు ఓవర్ యాక్షన్ కాదు

కెప్టెన్ అవ్వడానికి చేసిన ప్రయత్నాలు చూసి .. హోస్ట్ నాగార్జున పాపం అని అమర్ ని కెప్టెన్ చేశాడు. కెప్టెన్ అయిన తర్వాత అమర్ చేస్తున్న ఓవర్ యాక్షన్ చూస్తే .. వీడిని కెప్టెన్ ఎందుకు చేసానురా అని నాగార్జున తలబాదుకున్నే పరిస్థితి.

Written By: NARESH, Updated On : December 7, 2023 6:31 pm

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో స్పా బ్యాచ్ వర్సెస్ స్పై బ్యాచ్ మధ్య గొడవలు జరగడం కామనే. ముఖ్యంగా అమర్ దీప్ అయిన దానికి .. కానీ దానికి అనవసరంగా గొడవలు పడుతుంటాడు. గత నామినేషన్స్ లో కూడా అర్థం లేకుండా .. నన్ను ఆడంగోడు అంటావా అంటూ ప్రశాంత్ తో వాదనకు దిగాడు. రాంగ్ టైం లో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ మొన్నటి వరకు టాప్ ప్లేస్ లో ఉన్న అమర్ ఒక్కసారిగా నాలుగో స్థానానికి పడిపోయాడు.

అయితే కెప్టెన్ అవ్వడానికి చేసిన ప్రయత్నాలు చూసి .. హోస్ట్ నాగార్జున పాపం అని అమర్ ని కెప్టెన్ చేశాడు. కెప్టెన్ అయిన తర్వాత అమర్ చేస్తున్న ఓవర్ యాక్షన్ చూస్తే .. వీడిని కెప్టెన్ ఎందుకు చేసానురా అని నాగార్జున తలబాదుకున్నే పరిస్థితి. నేను కెప్టెన్ .. నేను చెప్పిందే వినాలి అంటూ డిమాండ్ చేస్తున్నాడు అమర్ దీప్. అయితే అమర్ దీప్ మాటల్ని తిప్పికొడుతూ ఓ రేంజ్ లో ఇచ్చి పడేశారు స్పై బ్యాచ్ లోని శివాజీ, యావర్, ప్రశాంత్.

గత రెండు రోజులుగా అర్జున్, అమర్ లను టాస్కుల పేరుతో ఆడుకున్నారు బిగ్ బాస్. చివరికి వాళ్ళు ఓట్ అప్పీల్ చేసుకునేందుకు కంటెండర్స్ గా నిలిచారు. అయితే వారిలో ఒకరికి మాత్రమే అవకాశం ఉండటంతో .. ఎవరు ఓట్ అప్పీల్ చేయాలో నిర్ణయించాలని మిగిలిన హౌస్ మేట్స్ కి వదిలేశారు బిగ్ బాస్. దీంతో యావర్, శివాజీ, ప్రశాంత్ ముగ్గురూ కలిసి అర్జున్ కి సపోర్ట్ చేశారు.

ఇక శోభా, ప్రియాంక లు మాత్రం తన ఫ్రెండ్ కి సపోర్ట్ చేశారు. దీంతో అమర్ తనని సపోర్ట్ చేయలేదు అని నోటికొచ్చినట్టు మాట్లాడాడు. స్పై బ్యాచ్ కూడా ఏమాత్రం తగ్గకుండా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే యావర్, అమర్ మధ్య పెద్ద గొడవ జరిగింది. యావర్ మాట్లాడుతుంటే ..నేను కెప్టెన్ ని .. నువ్వు వెళ్లి కూర్చో ..నేను చెప్పినట్టు వినాల్సిందే అంటూ టాపు లేచిపోయేలా అరిచి గోల చేశాడు. సెలెక్టెడ్ కెప్టెన్ అయితేనే ఇంత చేస్తున్న అమర్ .. ఇక గెలిచి కెప్టెన్ అయుంటే ఇంకెంత చేసేవాడో అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.