Samantha Chaitanya: విడాకుల డిప్రెషన్ నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు సమంత-నాగ చైతన్య. ఖాళీగా కూర్చుంటే ఆ జ్ఞాపకాలు వేధిస్తాయనే ఉద్దేశంతో వృత్తిలో బిజీగా గడుపుతున్నారు. సమంత వరుసగా కొత్త సినిమాలు ప్రకటించింది. అలాగే పుష్ప మూవీలో ఐటెం సాంగ్ చేస్తుండగా, దానికి సంబంధించిన షూట్ కూడా పూర్తి చేసింది.

మరోవైపు నాగ చైతన్య బంగార్రాజు, థ్యాంక్యూ చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న బంగార్రాజు సంక్రాంతి బరిలో దిగే అవకాశం కలదని ప్రచారమవుతోంది. కాగా నాగ చైతన్య కెరీర్ లో మొదటిసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడానికి సిద్దమవుతున్నాడట. అందులోనూ అది ఓ వెబ్ సిరీస్ అట. ఈ సిరీస్ లో చైతూ సీరియల్ కిల్లర్ గా కనిపిస్తారట. ఆయన పాత్ర సైకో లక్షణాలు కలిగి ఉంటుందట. ఇక ఈ సిరీస్ కి విక్రమ్ కుమార్ దర్శకుడు కాగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించనున్నారట.
దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ టాలీవుడ్ సర్కిల్స్ లో ప్రధానంగా ప్రచారం అవుతుంది. అయితే చైతూ ఎక్స్ వైఫ్ సమంత ఈ ప్రయోగం ఆల్రెడీ చేసేసింది. స్టార్ హీరోయిన్ ఇమేజ్ ఉన్న సమంత ది ఫ్యామిలీ మాన్ సిరీస్ లో తమిళ్ లేడీ రెబల్ గా సీరియస్ రోల్ చేశారు.
Also Read: “రాధే శ్యామ్” లో డబ్బింగ్ పనులు పూర్తి చేసిన బుట్టబొమ్మ పూజా హెగ్దే…
భారత్ లో దాడులు చేయడానికి వచ్చిన టెర్రరిస్ట్ గా ఆమె నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడం జరిగింది. ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ సూపర్ సక్సెస్ అయ్యింది. కెరీర్ లో మొదటిసారి నెగటివ్ రోల్ చేసిన సమంత, ఆ పాత్రలో జీవించారు. దీంతో చైతూ చేయనున్న డెబ్యూ వెబ్ సిరీస్ విషయంలో సన్నిహితులు ఆయనకు సలహా ఇస్తున్నారట. నెగిటివ్ రోల్ చేసి సమంత సక్సెస్ కాగా లేనిది… మనం హిట్ కొట్టలేమా.. ఈ ప్రాజెక్ట్ విషయంలో అసలు తగ్గొద్దు అంటున్నారట.
ఇక ఈ సిరీస్ ని ఛాలెంజింగ్ గా తీసుకున్న నాగ చైతన్య ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించే పనిలో ఉన్నారట. కాగా స్టార్స్ కూడా వెబ్ సిరీస్ ల వైపు అడుగులు వేస్తున్నారు. విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో ‘రానా నాయుడు’ పేరుతో ఓ సీరిస్ తెరకెక్కుతుంది. నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ ఈ సిరీస్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
Also Read: మోస్ట్ సెర్చ్డ్ ఫిమేల్ సెలబ్రిటీగా సమంత … టాప్ 10 లిస్ట్ చోటు కైవసం