Tollywood directors repeating same formula: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు ఒకే ఫార్మాట్లో సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతుంటారు. సక్సెస్ వచ్చిన, ఫెయిల్యూర్ వచ్చిన వాళ్ళ ఫార్మాట్ ని మాత్రం మార్చరు. ఒకే జానర్ లో రిపీటెడ్ గా సినిమాలు చేయడం వల్ల వాళ్ల సినిమాలను వాళ్లే కాపీ చేసుకున్నారా అనే డౌట్ అయితే సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కలుగుతుంది… ఇలాంటి దర్శకులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం…
బోయపాటి శ్రీను
‘భద్ర’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన బోయపాటి శ్రీను ఆ తర్వాత చేసిన అన్ని సినిమాలు యాక్షన్ ఎంటర్ టైనర్స్ గా తెరకెక్కాయి. అవన్నీ దాదాపు ఒకె స్టోరీతో తెరకెక్కినట్టుగా అనిపిస్తాయి. ఒక పాయింట్ ను రిపీటెడ్ గా చెబుతూ ప్రేక్షకులకు చిరాకు పుట్టిస్తున్నాడు. ఇక రీసెంట్ గా ‘అఖండ 2’ సినిమాతో కొత్త ప్రయోగం చేసినప్పటికి అది వర్కౌట్ కాలేదు. దాంతో మరోసారి తన పంథా లోనే సినిమాలు చేయాలనే ఆలోచనలో బోయపాటి శ్రీను ఉన్నట్టుగా తెలుస్తుంది…
శ్రీను వైట్ల
ఒకప్పుడు కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన శ్రీనువైట్ల ప్రస్తుతం తన మార్కెట్ ను పూర్తిగా కోల్పోయాడు. గోపీచంద్ తో ‘విశ్వం’ అనే సినిమా చేసినప్పటికి అది యావరేజ్ గా ఆడింది. ఆయన ప్రతి సారి కామెడీని నమ్ముకొని ముందుకు సాగుతుంటాడు. దానివల్ల కొన్నిసార్లు మైనస్ అవుతుంది. మరి కొన్నిసార్లు ప్లస్ అవుతుంది. ప్రస్తుతం అతనికి పెద్దగా మార్కెట్ కూడా లేదు. మరి ఇప్పుడు శర్వానంద్ తో చేస్తున్న సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అది కూడా కామెడీ జానర్ లోనే ఉంటుందా? లేదంటే కొత్త ప్రయత్నం ఏదైనా చేయబోతున్నాడా అనేది తెలియాల్సి ఉంది…
అనిల్ రావిపూడి
అనిల్ రావిపూడి సినిమాలు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంటాయి. అలాగే అందులో కామెడీ కూడా మిళితమై ఉంటుంది. తద్వారా ఆయన సినిమాల్లో కామెడీ అనేది ఓకే అనిపించినప్పటికి కొన్ని సినిమాల్లో మాత్రం రొటీన్ కామెడీల అనిపిస్తుంది. ఇక కొంతమంది దానిని క్రింజు కామెడీ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తుంటారు. అనిల్ ఇప్పటికైనా తన పంథా ను మార్చుకొని కొత్త జానర్ లో సినిమా చేస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…