https://oktelugu.com/

Dhanush-Nayanthara : ధనుష్, నయనతారలకు ఏమైంది? ఈ రేంజ్ వారా?`

డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మించిన ఓ సినిమాకు సంబంధించి కాపీరైట్ అంశం ఉంది. అయితే ఇద్దరి మధ్య వివాదానికి గల అసలు కారణం వేరే ఉందని కూడా టాక్. ఇద్దరి మధ్య తాజాగా జరుగుతున్న కాంట్రవర్సీ వెనుక అసలు కారణం ఏంటనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే చదివేసేయండి. కో

Written By: Swathi Chilukuri, Updated On : November 17, 2024 5:58 pm
Dhanush-Nayanthara

Dhanush-Nayanthara

Follow us on

Dhanush-Nayanthara :  కోలీవుడ్ స్టార్ ధనుష్.. లేడీ సూపర్ స్టార్ నయనతార ల గురించి తెలిసిందేగా. అయితే వీరిద్దరి మధ్య వార్ ఓ రేంజ్‌లో కొనసాగుతోంది. నయనతార కెరీర్, వివాహంపై రూపొందించిన ఓ డాక్యుమెంటరీ వల్ల ఈ వార్ మొదలైంది. డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మించిన ఓ సినిమాకు సంబంధించి కాపీరైట్ అంశం ఉంది. అయితే ఇద్దరి మధ్య వివాదానికి గల అసలు కారణం వేరే ఉందని కూడా టాక్. ఇద్దరి మధ్య తాజాగా జరుగుతున్న కాంట్రవర్సీ వెనుక అసలు కారణం ఏంటనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే చదివేసేయండి.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటుడిగా బిజీగా ఉంటూనే నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. వండర్ బార్ ఫిలిమ్స్ బ్యానర్‌పై అనేక చిత్రాలను నిర్మించారు. ‘నాను రౌడీ దాన్’ అనే చిత్రానికి ధనుష్ నిర్మించారు. దర్శకుడు విగ్నేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో విజయ్ సేతుపతి హీరోగా నయనతార హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా సమయంలోనే నయనతార, విగ్నేష్ లకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమగా మారి వివాహం దాకా వెళ్ళింది. తాజాగా నయనతార, కెరీర్ వివాహం వీటన్నింటిపై ఒక డాక్యుమెంటరీ రూపొందించింది.

అయితే నిర్మాత నుంచి అనుమతి రాకపోవడంతో ఆ సినిమా చిత్రీకరణ సమయంలో మొబైల్ ద్వారా తీసిన కొన్ని సెకన్ల పాటు ఉన్న వీడియోని డాక్యుమెంటరీలో వాడారు. దీని గురించి ధనుష్ కాపీ రైట్ కింద పది కోట్లు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. ధనుష్ కోర్టుని ఆశ్రయించడంపై నయనతార సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. మూడు పేజీల లేఖను విడుదల చేసి ధనుష్‌పై నయనతార ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ‘డియర్ ధనుష్ దర్శకులైన తండ్రి, అన్న సహకారంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి గొప్ప నటులైన మీరు నా లేఖను చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా.. నాలా ఒంటరి పోరాటం చేసేవారు ఎందరో ఉన్నారు.. ఇండస్ట్రీలో ఎలాంటి సంబంధం లేకుండా ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.

నెట్‌ఫ్లిక్స్‌లో నా కెరీర్‌కు సంబంధించి రూపొందిన డాక్యుమెంటరీ కోసం నేను మాత్రమే కాదు ఎంతోమంది అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తమపై పెంచుకున్న ప్రతీకారం ఇందులో భాగస్వామ్యమైన సభ్యులను కూడా ఇబ్బంది పెడుతుందన్నారు నయనతార. అందులోని అంశాలను వాడుకునేందుకు తను రెండేళ్ల నుంచి అనుమతి కోరుతుందట కానీ ధనుష్ ఇవ్వలేదని తెలిపింది. మూడు సెకన్ల క్లిప్ వాడుకున్నందుకు పది కోట్లు ఇవ్వాలని కాపీ రైట్ పేరుతో మీరు డిమాండ్ చేయడం బాధాకరం. ఇక్కడే మీ వ్యక్తిత్వం ఏంటనేది అర్థమవుతుంది. నోటీసులను మేం న్యాయబద్ధంగానే సమాధానం ఇస్తామని’ నయనతార తెలిపారు.

అయితే ఇక్కడ వివాదానికి కారణంగా కనబడేది ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన సినిమాకు సంబంధించిన కాపీరైట్ అంశం అయినా.. ఇద్దరి మధ్య ఈ స్థాయిలో వివాదానికి అసలు కారణం వేరే ఉందని సినీ పరిశ్రమకు సంబంధించిన కొందరు చెబుతున్నారు. పదేళ్ల క్రితం విడుదలైన ‘నాను రౌడీ దాన్’ చిత్రానికి ధనుష్ నిర్మాత కాగా.. నయనతార భర్త విగ్నేష్ దర్శకుడు. అయితే ఆ సినిమా నిర్మాణం కోసం ముందుగా అనుకున్నది 6 కోట్ల బడ్జెట్ అయితే సినిమా పూర్తి కావడానికి 12 కోట్లకు పైగా ఖర్చు అయిందని తెలుస్తోంది.

ఆ సినిమా నిర్మాణం జరుగుతున్న సమయంలోనే నయనతార, విగ్నేష్‌కు పరిచయం ఏర్పడడం.. వారిద్దరి మధ్య ప్రేమగా బంధం బలపడడం జరిగింది. ఇదే విషయం తాజాగా రూపొందించిన డాక్యుమెంటరీలో కూడా ఉంది. అయితే ఆ బడ్జెట్ అంతలా పెరగడానికి నయనతార కారణమని ధనుష్ అప్పట్లోనే మండిపడ్డట్టు ఇండస్ట్రీలో కూడా వార్తలు వచ్చాయి. సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ధనుష్ అవమానించాడట. అప్పటి నుంచి ఇప్పటి వరకు పగను పెంచుకున్నాడని తెలిపింది నయనతార. అందుకే కాపీరైట్ పేరుతో రిపోర్టు డిమాండ్ చేశారని..వారిని ఇబ్బంది పెడుతున్నారని పేర్కొంది నయన. సినిమా నిర్మాణానికి సంబంధించి బడ్జెట్ పెరిగిన అంశం నయనతార ఎక్కడా ప్రస్తావించనప్పటికీ ఇద్దరి మధ్య ఈ స్థాయిలో వివాదానికి అసలు కారణం మాత్రం అదేనని ఇండస్ట్రీలో వినబడుతున్న మాట.మరి ఇందులో నిజం ఎంత అనేది తేలాలంటే వారు క్లారిటీ ఇవ్వాల్సిందే.