Pawan Kalyan Record: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తనకి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టినవే కావడం విశేషం… ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ని మించిన నటుడు మరొకరు లేరు అనేది వాస్తవం…సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే ఆయన వరుస విజయాలను అందుకొని తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన మంచి విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు…అయితే ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఆ తర్వాత చేసిన సినిమాలన్నింటితో వరుసగా మంచి విజయాలను అందుకున్నాడు. వరుసగా ఏడు విజయాలను సొంతం చేసుకున్న ఆయన స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ఈ రికార్డు ను ఇప్పటి వరకు ఎవ్వరు బ్రేక్ చేయలేకపోవడం విశేషం…జూనియర్ ఎన్టీఆర్ బ్రేక్ చేస్తారని అందరు అనుకున్నారు. ఆయన కూడా వరుస టెంపర్ నుంచి దేవర వరకు 7 విజయాలను అందుకున్నప్పటికి ఎనిమిదో విజయాన్ని కనక సాధించినట్లయితే ఆయన పవన్ కళ్యాణ్ రికార్డును బ్రేక్ చేసేవాడు. కానీ ఇప్పుడు ఆ విజయాన్ని సాధించలేక పోయాడు.
Also Read: వన్ కళ్యాణ్ ‘ఓజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు..నార్త్ అమెరికా లో ఫైర్ స్ట్రోమ్!
‘వార్ 2’ సినిమాతో భారీ ప్లాప్ ను మూటగట్టుకున్న ఆయన ఈ సినిమాతో సక్సెస్ ను అందుకోలేక చాకిలపడిపోయాడు. దర్శకుడు సైతం ఈ సినిమాను ఇంట్రెస్టింగ్ గుండుకు తీసుకెళ్లడం లో ఫెయిల్ అయ్యాడు… మొత్తానికైతే పవన్ కళ్యాణ్ రికార్డును బ్రేక్ చేసే హీరోలు ఎవరూ లేరు అంటూ ఆయన చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నారు…
మరి ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండటం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ఇప్పటికి ఆయన క్రేజ్ మామూలుగా ఉండదు. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు దాదాపు నాలుగు రోజుల ముందు నుంచే ప్రేక్షకులు సంబరాలైతే చేసుకుంటారు.
రీసెంట్ గా వచ్చిన ‘హరిహర వీరమల్లు’ సినిమాతో ఆశించిన విజయాన్ని సాధించకపోయినప్పటికి వచ్చేనెల 25వ తేదీన ఓజీ సినిమాతో సక్సెస్ ను సాధించి మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…ఈ సినిమాతో కనుక సూపర్ సక్సెస్ ని సాధిస్తే పవన్ కళ్యాణ్ క్రేజ్ మరోసారి తారాస్థాయి వెళ్ళిపోతుందని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…