https://oktelugu.com/

Amitabh Bachchan : అమితాబ్ బచ్చన్ నోటా..అల్లు అర్జున్ మాట..’పుష్ప 2′ మేనియా మామూలుగా లేదుగా!

అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న పాపులర్ టాక్ షో 'కౌన్ బనేగా కరోడ్ పతి' లో ఇటీవలే 'ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసింది ఎవరు?' అనే ప్రశ్న వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ అభిమానులు అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండ్ నోట తమ అభిమాన హీరో గురించి ప్రశ్న అడగడాన్ని ఎంతో గర్వంగా భావించారు. ఇప్పుడు లేటెస్ట్ గా అల్లు అర్జున్ గురించి కూడా అలాంటి ప్రశ్ననే వచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 18, 2024 / 07:13 PM IST

    Amitabh Bachchan

    Follow us on

    Amitabh Bachchan : పుష్ప చిత్రం తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ టాలీవుడ్ ని దాటి పాన్ ఇండియా కి ఎగబాకిన సంగతి అందరికీ తెలిసిందే. మన టాలీవుడ్ హీరోల పాన్ ఇండియన్ సినిమాలు బాలీవుడ్ లో క్లిక్ అవ్వాలంటే కచ్చితంగా భారీ బడ్జెట్ , ఆసక్తికరమైన థియేట్రికల్ ట్రైలర్, పాటలు ఇవన్నీ ఉండాలి. ఇవి లేకపోతే బాలీవుడ్ ఆడియన్స్ లెక్క చేయరు. కానీ అల్లు అర్జున్ విషయం లో ఇది వేరు. ఆయనకు మొదటి నుండే డ్యాన్స్ పరంగా పాన్ ఇండియా లెవెల్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. పుష్ప చిత్రంతో ఆయనకి మహా రాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, ముంబై, కోల్ కత్తా వంటి ప్రాంతాలలో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. మాస్ సర్క్యూట్స్ లో అల్లు అర్జున్ కి ఉన్నంత క్రేజ్, అక్కడి యంగ్ హీరోలకు కూడా లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

    పుష్ప చిత్రం అక్కడి ఆడియన్స్ ని అంతలా అలరించింది. జనాలను తన నటనతో మైమరచిపోయేలా చేసాడు కాబట్టే భారతదేశ ప్రభుత్వం గుర్తించి ఆయనకు నేషనల్ అవార్డు కూడా ఇచ్చింది. ఇదంతా పక్కన పెడితే అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న పాపులర్ టాక్ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ లో ఇటీవలే ‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసింది ఎవరు?’ అనే ప్రశ్న వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ అభిమానులు అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండ్ నోట తమ అభిమాన హీరో గురించి ప్రశ్న అడగడాన్ని ఎంతో గర్వంగా భావించారు. ఇప్పుడు లేటెస్ట్ గా అల్లు అర్జున్ గురించి కూడా అలాంటి ప్రశ్ననే వచ్చింది. 2023 వ సంవత్సరం లో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డుని అందుకున్న హీరో ఎవరు అంటూ అమితాబ్ బచ్చన్ ఒక ప్రశ్న అడుగుతాడు. దీనికి సంబంధించిన వీడియోని అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా లో షేర్ చేసి తమ ఆనందాన్ని వ్యక్త పర్చుకున్నారు.

    సొంత కష్టంతో పైకి ఎదిగి, చరిత్ర పుస్తకాల్లో లిఖించదగ్గ గౌరవాన్ని తమ అభిమాన హీరో దక్కించుకున్నాడు అని, భారతదేశ మొట్టమొదటి సూపర్ స్టార్ నోటి నుండి, అల్లు అర్జున్ సాధించిన ఘనత గురించి ప్రశ్న రావడం ఎంతో గర్వకారణం అని సోషల్ మీడియా లో ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు. పుష్ప చిత్రం తో ఈ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్, ‘పుష్ప 2 : ది రూల్’ తో ఇక ఎలాంటి అద్భుతాలు సృష్టించబోతున్నాడో చూడాలి. ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా, డిసెంబర్ 6 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో విడుదల కాబోతుంది. బాహుబలి 2 , KGF 2 తర్వాత అన్ని భాషల్లో సమానమైన క్రేజ్, హైప్ ని తెచ్చుకున్న ఏకైక సినిమా ఇదే అని ట్రేడ్ పండితులు అంటున్నారు.