https://oktelugu.com/

‘బుర్రిపాలెం’ మనసు గెలిచిన మహేశ్‌ బాబు

‘తాను సంపాదించిన దాంట్లో కొంతైనా ఊరికి ఇవ్వాలి.. లేదంటే లావైపోతారు’.. ఈ డైలాగ్‌ సినిమాలోదైనా రియల్‌గా పాటిస్తున్నాడు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు. తన సొంతూరికి దూరంగా శ్రీమంతుడిగా ఉంటూ ఆ ఊరు బాగోగులను చూసుకుంటున్నాడు. పాఠశాలల దగ్గరి నుంచి రైతుల వరకు వారికి ఏం కావాలో తెలుసుకుంటున్నాడు. తను వల్ల అయిన సాయం చేస్తూ కొన్నింటిని ప్రభుత్వానికి నివేదిస్తున్నాడు. Also Read: సుశాంత్ కేసులో బాలీవుడ్ స్టార్లు, తెలుగు హీరో భార్య? ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే ఆ ఊరి […]

Written By:
  • NARESH
  • , Updated On : September 22, 2020 6:41 pm
    mahesh

    mahesh

    Follow us on

    mahesh‘తాను సంపాదించిన దాంట్లో కొంతైనా ఊరికి ఇవ్వాలి.. లేదంటే లావైపోతారు’.. ఈ డైలాగ్‌ సినిమాలోదైనా రియల్‌గా పాటిస్తున్నాడు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు. తన సొంతూరికి దూరంగా శ్రీమంతుడిగా ఉంటూ ఆ ఊరు బాగోగులను చూసుకుంటున్నాడు. పాఠశాలల దగ్గరి నుంచి రైతుల వరకు వారికి ఏం కావాలో తెలుసుకుంటున్నాడు. తను వల్ల అయిన సాయం చేస్తూ కొన్నింటిని ప్రభుత్వానికి నివేదిస్తున్నాడు.

    Also Read: సుశాంత్ కేసులో బాలీవుడ్ స్టార్లు, తెలుగు హీరో భార్య?

    ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే ఆ ఊరి అభివృద్ధి కోసం నిత్యం శ్రమిస్తున్నాడు. ఆయనే కాదు ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్‌, అక్క పద్మినిలు సైతం అప్పుడప్పుడూ ఆ ఊరిని సందర్శిస్తూ మీ కష్టాలను తీర్చేందుకు మేమున్నామంటూ వారిని ఆక్కున చేర్చుకుంటున్నారు.

    గుంటూరు జిల్లా తెనాలి మండలంలో ఉంది బుర్రిపాలెం. 1000 ఇళ్లు 3000 జనాభా కలిగిన చిన్న గ్రామం. సూపర్‌స్టార్‌ కృష్ణ సొంత గ్రామమైన బుర్రిపాలెం కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేశాడు. పాఠశాలలు కట్టించాడు. రైతులకు అండగా నిలిచారు. అప్పుడప్పుడు గ్రామాన్ని సందర్శిస్తూ వారి బాగోగులు తెలుసుకుంటున్నాడు. కానీ ఈ విషయాన్ని మహేష్ పబ్లిసిటీ కోసం వాడుకోడు. అందుకే ఆయన సేవా కార్యక్రమాలు బయటకు తెలియవు.

    కృష్ణ తల్లి నాగరత్నం ఇక్కడ సర్పంచ్‌గా ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చెందారు. అయినా కూడా బుర్రిపాలెంపై కృష్ణకు ప్రేమ తగ్గలేదు. ఇప్పటికీ ఆయన అప్పుడప్పుడు బుర్రిపాలెంను సందర్శిస్తుంటారు.

    Also Read: వైరల్ ఫొటో: ఇలా ఉన్నాడేంటి? మాసిన గడ్డంతో పవర్ స్టార్

    ఈ నేపథ్యంలో సూపర్‌స్టార్‌ కృష్ణ కుమారుడు మహేశ్‌బాబు బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ పాఠశాలలను అభివృద్ధి చేశాడు. గ్రామాలకు రోడ్లు వేయించారు.  గ్రామంలో ఏర్పాటు చేసిన మాడ్రన్‌ బస్‌స్టాప్‌లో మొత్తం మహేశ్‌బాబు పోస్టర్లు వేసి గ్రామస్థులు తమ అభిమానాన్ని చాటుకున్నారు.

    అయితే మహేశ్‌ సినిమాల్లో బిజీగా ఉండడంతో ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్‌ బుర్రిపాలెంలో పర్యటిస్తున్నారు. ఈ మధ్య ఆమె వెళ్లి పాఠశాల అభివృద్ధికి కావాల్సిన చెక్కులు అందించారు. ఆమెతో పాటు మహేశ్‌ అక్క పద్మిని కూడా ఉన్నాడు.