Bunny Vasu latest comments: ఈమధ్య కాలంలో బన్నీ వాసు(Bunny Vasu) పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వినిపిస్తోంది. అల్లు అరవింద్(Allu Aravind) గీతా ఆర్ట్స్(Geetha Arts) సంస్థ లో GA2 ద్వారా ఎన్నో సూపర్ చిత్రాల నిర్మాణం లో భాగమయ్యాడు బన్నీ వాసు. ఈ ఒక్క ఏడాది లోనే ఈయన నుండి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది. అలాంటి బన్నీ వాసు తొలిసారి అల్లు అరవింద్ తో కాకుండా తన స్నేహితులతో చేతులు కలిపి ‘మిత్ర మండలి’ అనే చిత్రాన్ని నిర్మించాడు. విడుదలకు ముందు యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని క్రియేట్ చేసుకొని విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. నిర్మాతగా బన్నీ వాసుకి తగిలిన మొట్టమొదటి షాక్ ఇది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన కొన్ని వెబ్ సైట్స్ ని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.
తన సినిమా పై పనిగట్టుకొని నెగిటివిటీ వ్యాప్తి చేస్తున్నారని, నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఒక రేంజ్ లో రెచ్చిపోయాడు. ఆయన ప్రసంగం బాగా వైరల్ అవ్వడం తో ‘మిత్ర మండలి’ అనే సినిమా విడుదల అవ్వబోతుందనే విషయం ఎక్కువ మందికి తెలిసింది. కానీ బన్నీ వాసు ప్రసంగం ప్రభావం వల్లనో ఏమో తెలియదు కానీ, ఈ సినిమా యావరేజ్ రేంజ్ లో ఉన్నప్పటికీ కూడా ప్రీమియర్ షోస్ నుండే డిజాస్టర్ రివ్యూస్ వచ్చాయి. ఫలితంగా ఒక్క రోజు కూడా థియేటర్ లో నిలబడలేకపోయింది ఈ సినిమా. నోటికొచ్చినట్టు మాట్లాడి నష్టాలు కొని తెచ్చుకున్నావని అల్లు అరవింద్ బన్నీ వాసు కి పెద్ద కోటింగ్ ఇచ్చినట్టు ఉన్నాడు. నేడు ‘గర్ల్ ఫ్రెండ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆ విషయాన్ని చెప్పుకొచ్చాడు బన్నీ వాసు.
ముందుగా SKN మైక్ అందుకొని ఇప్పుడు బన్నీ వాసు అగ్రెసివ్ స్పీచ్ ఇస్తాడు అని అంటాడు. అప్పుడు బన్నీ వాసు ‘లేదు.. నో కాంట్రవర్సీ..వెరీ కూల్..మొన్న జరిగిన కాంట్రవర్సీ కి ఆయన (అల్లు అరవింద్) తిట్టిన తిట్లు మా నాన్నతో కూడా తినలేదు. అందుకే ఈరోజు చాలా జాగ్రత్తగా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతాను’ అని అంటాడు. అప్పుడు అల్లు అరవింద్ ‘కాస్త వైరల్ కంటెంట్ ఇవ్వు’ అని అంటాడు. ‘వైరల్ ఇవ్వమంటారు..మళ్లీ ఆయనే వైరు పట్టుకొని కొడుతాడు తర్వాత. అందుకే కనీసం నాలుగైదు నెలలు నో వైరల్ కంటెంట్’ అని అంటాడు బన్నీ వాసు. చూసేందుకు ఈ సంభాషణ చాలా ఫన్నీ గా అనిపిస్తుంది. గీత ఆర్ట్స్ సంస్థ నిర్మాణం లో రష్మిక ప్రధాన పాత్రలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ నేడు విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లోనే ఈ సరదా సంభాషణ జరిగింది.
కాంట్రవర్సీ లు ఏం లేవు
అరవింద్ గారు తిట్టిన తిట్లు మా నాన్న గారు కూడా తిట్టలేదు#TheGirlFriend pic.twitter.com/Ki6qKYczRV
— Telugu360 (@Telugu360) October 25, 2025