Bunny Vasu Comment: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ దారుణంగా తయారయ్యింది. ఒకప్పుడు మినిమం గ్యారంటీ సినిమాలనేవి ఉండేవి. అంటే ప్రొడ్యూసర్ సేఫ్ జోన్ లో ఉండేవాడు. ఎంత రొటీన్ కమర్షియల్ సినిమాలు చేసిన కూడా వాటికి మినిమం ప్రేక్షకుల దగ్గర నుంచి ఆదరణ అయితే వచ్చేది. తద్వారా నష్టపోకుండా ప్రొడ్యూసర్లకి కలెక్షన్స్ అయితే వచ్చేవి. కానీ ఇప్పుడు ఒక సినిమా యావరేజ్ అనే మాట లేదు…అయితే సూపర్ హిట్ లేకపోతే డిజాస్టర్ అంతే…ఇక చాలా రోజుల నుంచి ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఇక స్టార్ ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న బన్నీ వాసు సైతం ఇదే విషయాన్ని తెలియజేశాడు. ప్రస్తుతం ఆయన ‘కన్యాకుమారి’ అనే ఒక చిన్న సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. అందులో భాగంగానే ప్రెస్ తో మాట్లాడిన ఆయన సినిమా ఇండస్ట్రీ ఎదుర్కుంటున్న ప్రాబ్లం ల గురించి కూడా చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు…సినిమా ఇండస్ట్రీ ఇంతకు ముందులా లేదని సినిమా సక్సెస్ అయితే టాప్ ప్రొడ్యూసర్ గా పేరు సాధించుకోవచ్చు కానీ అదే ఒక సినిమా ఫ్లాప్ అయితే ప్రొడ్యూసర్ సైతం పాతాళానికి పడిపోతున్నాడు. భారీగా నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతోంది…ప్లాప్ సినిమాలకు పోస్టర్ల డబ్బులు కూడా రావడం లేదంటూ ఆయన కామెంట్స్ చేశాడు…ఇక ఇదంతా గమనిస్తున్న కొంతమంది సినిమా మేధావులు సైతం ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఈ ప్రాబ్లమ్స్ కి కారణం బడ్జెట్ విపరీతంగా పెరిగిపోవడం. ఈ రోజుల్లో మినిమం ప్రొడక్షన్ వాల్యూస్ లేకుండా సినిమాలను తీస్తే జనాలు చూడడం లేదు.
Also Read: ఓజీ లో స్పెషల్ క్యామియో రోల్ చేస్తున్న మహేష్ బాబు?
వాళ్ళు అన్ని సినిమాలను బాహుబలి రేంజ్ లో ఊహించుకుంటున్నారు. కాబట్టే ఇండస్ట్రీకి ఇలాంటి ఒక దారుణమైన పరిస్థితి అయితే వచ్చిందని, సినిమా పెద్దలు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఒక సినిమా మీద ఎంత బడ్జెట్ ని కేటాయించాలి. దాని మీద ఎంత కలెక్షన్స్ వస్తాయి అనే మినిమం క్యాలిక్యులేషన్స్ ఉన్నప్పుడు సినిమా యావరేజ్ గా ఉన్నా కూడా ప్రొడ్యూసర్ సేఫ్ జోన్ లో ఉంటాడు.
డిస్ట్రిబ్యూటర్లు సైతం కొంతవరకు సేఫ్ జోన్ లో ఉండొచ్చు. మరి అలా కాకుండా హీరోల మార్కెట్ తో సంబంధం లేకుండా సినిమా కంటెంట్ ని పట్టించుకోకుండా గ్రాండియార్ ని అందించాలనే ఉద్దేశ్యంతో సినిమాలు చేస్తే మాత్రం ఆ సినిమాలు విపరీతంగా నష్టాన్ని మిగిల్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని తెలుసుకుంటే సినిమా ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ కూడా నష్టపోడు.
ఇక ముఖ్యంగా హీరోలు వాళ్ళ రెమ్యూనరేషన్ ని భారీగా తగ్గించుకోవాల్సిన అవసరం అయితే ఉంది… ప్రొడ్యూసర్ ను కాపాడాలి, సినిమాలను బతికించాలి అనుకుంటే మాత్రం సినిమాల బడ్జెట్ ను భారీగా తగ్గించాలి. అదొక్కటే ఇప్పుడు ప్రొడ్యూసర్లను సేఫ్ జోన్ లో ఉంచుతోంది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేస్తాం అంటే మాత్రం ఇక మీదట చాలామంది ప్రొడ్యూసర్లు సినిమాలు చేయడానికి ముందుకు రాకపోవచ్చు… ముఖ్యంగా హీరోలు కూడా వల్ల రెమ్యునరేషన్స్ ను తగ్గించాల్సిన అవసరం అయితే ఉంది…