Sandeep Reddy Vanga Emotional: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాన్ని సృష్టించిన సినిమాల్లో అర్జున్ రెడ్డి ఒకటి… ఇక అలాంటి అర్జున్ రెడ్డి మూవీ రిలీజ్ అయి ఇప్పటికి 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న క్రమంలో ఆ సినిమా దర్శకుడు అయిన సందీప్ రెడ్డి వంగ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే పెట్టాడు. ఇక దానికి అనుగుణంగానే ఈ సినిమాకి ముందు ఆయన కెరియర్ ఒకలా ఉండేదని ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా తనకు స్టార్ట్ డైరెక్టర్ అనే ఇమేజ్ వచ్చిందని తెలియజేశాడు. ఆయన రాసుకున్న ప్రతి ఎమోషన్ ని ప్రేక్షకులు అర్థం చేసుకొని దానిని గొప్ప సక్సెస్ గా నిలిపినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలను తెలియజేశాడు… అర్జున్ రెడ్డి 2017 ఆగస్టు 25వ తేదీన రిలీజ్ అయింది. అంటే ఈరోజుకి సరిగ్గా 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరి ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాతో సందీప్ రెడ్డి వంగ ప్రతి క్రాఫ్ట్ లో ఒక కొత్తదనాన్ని అయితే చూపించే ప్రయత్నం చేశాడు. 1989వ సంవత్సరంలో వచ్చిన శివ సినిమా ఎలాంటి సంచలనాన్ని క్రియేట్ చేసిందో ఆ తర్వాత వచ్చిన ఈ అర్జున్ రెడ్డి సినిమా దానిని మరిచిపోయేలా చేసింది అంటూ సినిమా మేధావులు సైతం ఈ సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి.
Also Read: ఓజీ లో స్పెషల్ క్యామియో రోల్ చేస్తున్న మహేష్ బాబు?
ఈ మూవీ లో సందీప్ ప్రతి చిన్న విషయాన్ని కూడా క్లియర్ గా చూపించే ప్రయత్నం అయితే చేశారు. మరి దర్శకుడు ఎక్కడ కూడా డివియెట్ అవ్వకుండా ఈ సబ్జెక్ట్ ని ఏ కాన్సెప్ట్ తో అయితే తెరకెక్కించాలి అనుకున్నాడో దాన్ని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు…
ఈ సినిమాతో తనకున్న ఎమోషన్ అలాంటిది అని ప్రతి సీన్ ని ఒక అద్భుతంగా చూపించే ప్రయత్నం చేశానని ఎక్కడా కూడా ఆ ఫీల్ మిస్ అవ్వకుండా ఉండేలా రాసుకున్నానని దానిని స్క్రీన్ మీద అంతకుమించి ప్రజెంట్ చేశానని సందీప్ రెడ్డి వంగ చేసిన పోస్ట్ లో తెలియజేశాడు… ఇక ఈ పోస్ట్ చూస్తుంటే ఇది చాలా ఎమోషనల్ గా ఉంది. దానికి తోడుగా విజయ్ దేవరకొండ కి ఆయన సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఒక మేకింగ్ వీడియో ని సైతం రిలీజ్ చేశాడు…
నిజానికి అర్జున్ రెడ్డి సినిమా వచ్చిన తర్వాత చాలా మంది ప్రేక్షకులు సినిమా చూసే ధోరణి మారిపోయింది. దర్శకులైతే వాళ్లు కూడా సినిమాను తీసే ఐడియాలజీని మార్చుకున్నారు. చాలా కొత్త కాన్సెప్ట్ లను ప్రేక్షకులకు పరిచయం చేయాలనే దృక్పథంతో ముందుకు సాగుతున్నారు…