
‘గీతా ఆర్ట్స్ 2’ అంటే నిర్మాత ‘బన్నీ వాసు’నే ముందు గుర్తుకు వస్తాడు. పైగా బన్నీ వాసుకి మంచి జడ్జ్ మెంట్ ఉంది అని , అతనికి కథల పై మంచి పట్టు ఉంది అని.. ఇలా ఓ రేంజ్ లో బన్నీ బసు గురించి చెబుతూ ఉంటారు. కానీ, ఇప్పుడు ఆ పేరే బన్నీవాసును బాగా ఇబ్బంది పెడుతుంది. ఆయన లాస్ట్ సినిమా ‘చావు కబురు చల్లగా’ అనే సినిమా విషయంలో బన్నీవాసు బాగా నిరుత్సాహ పడ్డాడు. ఆ సినిమా కేవలం బన్నీవాసు జడ్జ్ మెంట్ తో మొదలైంది.
పైగా రిలీజ్ కి ముందు బన్నీవాసు ఆ సినిమా విషయంలో కాస్త అతి చేశారు. సినిమా సూపర్ హిట్ అంటూ హడావుడి చేశారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక. ఘోరంగా పరాజయం పాలు అయింది. ఇప్పుడు, ఇదే బన్నీవాసును భయ పెడుతుంది. ఎందుకంటే.. అఖిల్ హీరోగా వస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్’ సినిమా కూడా బన్నీవాసు జడ్జ్ మెంట్ వల్లే ముందుకు వెళ్ళింది.
కానీ, బన్నీవాసు అనుకున్నట్లుగా సినిమా రాలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అసలు బాగాలేదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అందుకే.. నష్టం అని తెలిసి కూడా.. బన్నీవాసు ఈ సినిమా విషయంలో ఇప్పటికే అనేకసార్లు రీషూట్లు కూడా చేయించాడు. అయినా అవుట్ ఫుట్ లో తేడా లేదు. ఎన్నో కరెక్షన్లు చేసినా సినిమాలో ఏదో మిస్ అవుతుంది.
తీసుకున్న కథే కరెక్ట్ కాదు అని ఒకపక్క అల్లు అరవింద్ చెబుతున్నాడట. కానీ ఆ కథనే నమ్మి బన్నీవాసు ముందుకు వెళ్ళాడు. ఇక ఈ సినిమా త్వరలోనే మన ముందుకు రాబోతుంది. మరి సినిమా గాని ప్లాప్ అయితే, బయ్యర్లలో డిస్ట్రిబ్యూటర్స్ లో బన్నీవాసు పై నమ్మకం పోతుంది. కాబట్టి, బన్నీవాసుకి ఈ సినిమా చాలా కీలకం.
అందుకే, బన్నీవాసు.. పూజా హెగ్డే నమ్మకున్నాడు. ఆమెకు యూత్ లో, మాస్ లో మంచి పాపులారిటీ ఉంది. సినిమాలో అలాగే సాంగ్స్ లో పోస్టర్లలో పూజా హెగ్డే అందాలు హైలెట్ అయ్యేలా ఆమె చేత ఓవర్ ఎక్స్ పోజింగ్ చేయిస్తున్నాడు. ఈ క్రమంలో పూజా హెగ్డే ఈ సినిమా కోసం కొన్ని ప్రత్యేకమైన బోల్డ్ స్టిల్స్ ఇవ్వబోతుంది.