Bunny Heroine: కాంట్రవర్సీ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది ఆదా శర్మ. ఆమె నటించిన ‘ది కేరళ స్టోరీ’ అతిపెద్ద వివాదానికి తెరలేపింది. కేరళలో ముస్లిం యువకులు లవ్ జిహాద్ కి పాల్పడుతున్నారు. హిందూ అమ్మాయిలను ముస్లిం అబ్బాయిలు ప్రేమించి వాళ్ళను విదేశాలకు తరలిస్తున్నారు. టెర్రరిస్ట్ గ్రూప్స్ కి అప్పజెబుతున్నారనేది ది కేరళ స్టోరీ చిత్ర సారాంశం. ది కాశ్మీర్ ఫైల్స్ అనంతరం ఆ స్థాయిలో వివాదం రాజేసింది ది కేరళ స్టోరీ. 2023లో ది కేరళ స్టోరీ విడుదల కాగా ఆ చిత్ర ప్రదర్శనను పలు థియేటర్స్ లో అడ్డుకోవడం జరిగింది.
బిస్తర్ మూవీతో మరో వివాదం రాజేసింది ఆదా శర్మ. బిస్తర్: ది నక్సలైట్ స్టోరీ చిత్రాన్ని ఓ వర్గం వ్యతిరేకించింది. బిస్తర్ చిత్ర పోస్టర్ కూడా వివాదాస్పదం అయ్యింది. బిస్తర్ మూవీని దర్శకుడు సుదీప్తో సేన్ తెరకెక్కించారు. ఆదా శర్మ ప్రధాన పాత్ర చేసింది. ఇందిరా తివారి, విజయ్ కృష్ణ ఇతర కీలక రోల్స్ లో నటించారు. మార్చి 15న విడుదలైన బిస్తర్ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు.
కాగా ఈ కాంట్రవర్సియల్ మూవీ బిస్తర్ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. బిస్తర్ మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ జీ 5 సొంతం చేసుకుంది. బిస్తర్ జీ 5లో అందుబాటులోకి వచ్చింది. ప్రేక్షకులు మరొకసారి చూసి ఎంజాయ్ చేయండి. ఆదా శర్మ ఓ సీరియస్ రోల్ లో ఆకట్టుకుంది. బిస్తర్ చిత్ర కథ విషయానికి వస్తే… ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం నక్సలిజాన్ని కేంద్రబిందువుగా ఉంది. ఆ రాష్ట్రంలో జరిగే నక్సల్ కార్యకలాపాలు, అక్కడి వాస్తవ సంఘటనల ఆధారంగా బిస్తర్ తెరకెక్కించారు.
ఆదా శర్మ నక్సలిజానికి వ్యతిరేకంగా పోరాడే ఐపీఎస్ అధికారిణి రోల్ చేసింది. ఆదా శర్మ తెలుగులో హార్ట్ అటాక్ చిత్రం చేసింది. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. క్షణం, కల్కి చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించారు. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలో సెకండ్ హీరోయిన్ రోల్ చేసింది. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు.