Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమాలో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే, ఒకప్పుడు కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేసి మంచి హాస్యాన్ని పండించిన సునీల్, ఆ తర్వాత హీరోగా కూడా కొన్ని సినిమాలు చేశాడు. ఈ క్రమంలో రెండు, మూడు హిట్లు కూడా ఇచ్చాడు. కానీ కాలం చల్లగా చూడలేదు. హీరోగా కెరీర్ ను కంటిన్యూ చేయలేక.. చివరకు క్యారెక్టర్ల కోసం మళ్లీ ఫైరవీలు చేయాల్సి వచ్చింది.

మధ్యలో విలన్ గా కూడా కొన్ని సినిమాలు చేసినా.. ఆ విలన్ పాత్రలు ఎందుకో పెద్దగా క్లిక్ అవ్వలేదు. అయితే, ఇలాంటి సమయంలో సునీల్ కి ఒక పాత్ర వచ్చింది. అదే ‘పుష్ప’ సినిమాలో ఓ విలన్ పాత్ర. విలన్ గా సునీల్ గెటప్, చిత్తూరు యాసలో మాట్లాడిన తీరు ఈ సినిమాలో చాలా బాగా వచ్చిందట. మొత్తానికి సునీల్ పాత్రపై ఆసక్తి పెరిగింది.
ఈ రోల్ సునీల్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందని చెబుతున్నారు. అయితే, అల్లు అర్జున్ కూడా సునీల్ పెర్ఫార్మన్స్ చూసి షాక్ అయ్యాడట. అంత గొప్పగా సునీల్ ఈ చిత్రంలో నటించాడని, అందుకే సునీల్ నటన చూసి బన్నీ కూడా ఆశ్చర్యపోయాడని టీమ్ లోని సభ్యులు చెబుతున్నారు. ఇటీవల బన్నీ తన పాత్రకు డబ్బింగ్ చెప్పాడు.
Also Read: ఊ అంటారా మావా… ఊహూ అంటారా సాంగ్ కాపీ కొట్టారా…
ఆ సమయంలో కావాలని సునీల్ సీన్స్ పెట్టుకుని చూశాడట. ఇక సునీల్ పెర్ఫార్మన్స్ కి బన్నీ ఫిదా అయిపోయాడు. వెంటనే సుకుమార్ కి ఫోన్ చేసి సునీల్ పాత్ర నాకు చాలా బాగా నచ్చిందని.. అసలు తాను సునీల్ పాత్ర గురించి ఈ స్థాయిలో ఊహించలేదని బన్నీ తెగ హ్యాపీగా ఫీల్ అయ్యాడట.
మరి సునీల్ అంత గొప్పగా ఏమి చేసాడో చూడాలి. మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఐటెం సాంగ్ బాగా హిట్ అయింది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.