Salaar Re Release: బాహుబలి సిరీస్ తర్వాత వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకున్న ప్రభాస్ కి ‘సలార్’ చిత్రం ఏ రేంజ్ బూస్ట్ ఇచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేజీఎఫ్ సిరీస్ వంటి వెండితెర అద్భుతాలను సృష్టించిన తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ తో ఈ సినిమా చేస్తున్నాడని ప్రకటన వచ్చిన రోజు నుండే అంచనాలు ఆకాశాన్ని అంటాయి. గత ఏడాది డిసెంబర్ 22వ తారీఖున విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని ఫుల్ రన్ లో 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో అయితే #RRR చిత్రం తర్వాత వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన రెండవ సినిమాగా ‘సలార్’ చరిత్ర సృష్టించింది.
థియేటర్స్ లో ఇంత మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ చిత్రం, ఓటీటీ లో కూడా అదే స్థాయి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ సినిమాని చూసిన అనేక మంది ఓటీటీ ప్రేక్షకులు కేజీఎఫ్ కంటే బాగుంది అంటూ ఎలివేషన్స్ ఇచ్చారు. స్లో పాయిజన్ లెక్క ప్రతీ ఒక్కరికి ఈ సినిమాలోని సన్నివేశాలు డ్రగ్స్ లాగా ఎక్కేశాయి. ప్రతీరోజు ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఓటీటీ లో చూసే ఆడియన్స్ సంఖ్య లక్షల్లో ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ ఆడియన్స్ అమితంగా ఈ చిత్రాన్ని ఓటీటీలో ఇష్టపడ్డారు. అయితే అక్టోబర్ 23 వ తారీఖున ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని కొన్ని ప్రాంతాల్లో గ్రాండ్ గా రీ రిలీజ్ చేసారు. రెస్పాన్స్ అదిరిపోయింది. కేవలం హైదరాబాద్ సిటీ నుండే ఈ చిత్రానికి 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. పెద్దగా ప్లానింగ్ లేకుండా, రేపు విడుదల అనగా, ఈరోజు ప్రకటించి కొట్టిన కలెక్షన్స్ ఇవి. అలాగే ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 22 వ తారీఖున వైజాగ్, విజయవాడ వంటి ప్రాంతాలలో కూడా విడుదల చేయబోతున్నారు.
మొత్తం మీద ఫుల్ రన్ లో ఈ చిత్రానికి కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు పాత సినిమాలు చాలా పకడ్బందీగా రీ రిలీజ్ అవుతాయి. అలాంటి ప్లానింగ్ తో ప్రభాస్ ఫ్యాన్స్ రాలేకపోయారు ఈసారి. కొంతమంది బయ్యర్లు మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తుండగా, మరికొంతమంది బయ్యర్లు ఈశ్వర్ సినిమాని రీ రిలీజ్ చేసారు. కొందరు రెబెల్, మరికొందరు సలార్ వంటి చిత్రాలను రీ రిలీజ్ కి ప్లాన్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానులకు ఏ సినిమాని ప్రోత్సహించాలి అర్థం కాలేదు. మరో విశేషం ఏమిటంటే జపాన్ చిత్రం లో ప్రభాస్ కెరీర్ లో ఫ్లాప్ గా నిల్చిన ‘రాధే శ్యామ్’ ని కూడా విడుదల చేయబోతున్నారు. ఇలా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ లేకుండా రీ రిలీజ్ తో ఆల్ టైం రికార్డు నెలకొల్పే అవకాశాన్ని కోల్పోయారు ప్రభాస్ ఫ్యాన్స్.