
Balakrishna Gopichand Malineni: నట సింహం నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో తన 107వ సినిమాని చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి నటించబోతున్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. నట సింహం కి పోటీగా డైలాగులు చెప్పాలంటే.. అది సునీల్ శెట్టి లాంటి లీడింగ్ లో ఉన్న యాక్టరే కావాలని, అందుకే ఆయనను ఎంపిక చేశాం అని చెప్పారు. కానీ ఈ కలయిక కుదర్లేదు.
ఓ దశలో తమిళ విలక్షణ కథానాయకుడు విజయ్ సేతుపతిను కూడా బాలయ్యకు విలన్ గా ఒప్పించాలని ప్రయత్నాలు చేశారు. అవి వర్కౌట్ కాలేదు. మధ్యలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను కూడా విలన్ గా చేయమని అడుగుదాం అనుకున్నారు. కాకపోతే బడ్జెట్ సమస్యలు.. సంజయ్ రెమ్యునరేషన్ భారీగా ఉంటుంది. అందుకే, ఆ ఆప్షన్ జోలికి వెళ్ళలేదు.
ఇలాంటి పరిస్థితుల్లో గోపీచంద్ మలినేని దొరికిన మరో నటుడు..కన్నడ నటుడు దునియా విజయ్. కన్నడంలో దునియా సినిమాతో బాగా పాపులరయ్యాడు. మంచి నటుడు, ముఖ్యంగా విలన్ పాత్రలకు పర్ఫెక్ట్ గా సరిపోతాడు. అన్నిటికీ మించి బడ్జెట్ లో వస్తాడు. అందుకే, గోపీచంద్ మలినేని దునియా విజయ్ ను విలన్ గా ఫైనల్ చేశాడు.
కానీ, ఇప్పుడు మరో పేరు వినిపిస్తోంది. ఒకప్పటి తమిళ హీరో శరత్ కుమార్ ను బాలయ్య(Balakrishna) సినిమాలో మెయిన్ విలన్ గా పెట్టాలని గోపీచంద్ మలినేని ప్లాన్ చేస్తున్నాడట. బాలయ్యకి విలన్ గా మంచి పేరు ఉన్న హీరో కావాలి. శరత్ కుమార్ మాజీ హీరో. పైగా మంచి పర్సనాలిటీ ఉన్న నటుడు. కరెక్ట్ గా వాడుకుంటే.. బెటర్ ఆప్షన్ అవుతాడు అంటూ మైత్రీ మూవీ మేకర్స్ వారు కూడా ఫీల్ అవుతున్నారు.
ఆ మధ్య ఇదే మైత్రీ మూవీ మేకర్స్ హీరో మాధవన్ ను బాలయ్యకు విలన్ గా ఒప్పించడానికి మల్లగుల్లాలు పడింది. మాధవన్ కూడా బాలయ్యకి విలన్ గా చేయడానికి ఒప్పుకున్నాడు. కానీ అక్కడ కూడా రెమ్యునరేషన్ వ్యవహారమే తేడా కొట్టింది. మొత్తానికి బాలయ్య విలన్లకు బడ్జెట్ సమస్యలు ఎక్కువైపోయాయి. ఇది బాలయ్యకే అవమానం. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటించబోతుంది.
Also Read: బాలయ్య సినిమాలో విలన్‌గా మోహన్‌బాబు!