Homeఎంటర్టైన్మెంట్Priyanka Chopra: లాస్​ ఏంజెల్స్​లో భర్తతో కలిసి బాలీవుడ్​ బ్యూటీ దీపావళి వేడుకలు.. నెట్టింట ఫొటోలు...

Priyanka Chopra: లాస్​ ఏంజెల్స్​లో భర్తతో కలిసి బాలీవుడ్​ బ్యూటీ దీపావళి వేడుకలు.. నెట్టింట ఫొటోలు వైరల్​!

Priyanka Chopra: సినీ పరిశ్రమలో ఎటువంటి బ్యాక్​గ్రౌండ్​ లేకపోయినా.. విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్​ బ్యూటీ ప్రియాంక చోప్రా. ఇప్పటి వరకు తన కెరీర్​లో దాదాపు బాలీవుడ్​ స్టార్​ హీరోలందరితో స్క్రీన్​ షేర్​ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ హాలీవుడ్​లోనూ అడుగుపెట్టి గ్లోబల్​ స్టార్​గా మారింది. తన అందం అభినయంతో అక్కడకూడా మెప్పించగలిగింది. ఈ క్రమంలోనే వరుస హిట్​ చిత్రాలతో అగ్రకథానాయకిగా కొనసాగుతోంది. కాగా, కెరీర్​ మంచి ఫామ్​లో ఉండగానే హాలీవుడ్​ నటుడు, గాయకుడు నికో జోనాస్​ను విహాహం చేసుకుని అమెరికాలోనే స్థిరపడిపోయింది. అయితే, అమెరికాలో ఉన్నప్పటికీ భారతీయ సంప్రదాయాలను ఏ మాత్రం మర్చిపోలేదు ఈ ముద్దుగుమ్మ.

 

తాజాగా, లాజ్​ ఎంజెల్స్​లోని తన నివాసంలో భర్త నికో జోనాస్​తో కలిసి దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకుంది ప్రియాంక. భర్త కుటుంబ సబ్యులతో కలిసి లక్ష్మీదేవి పూజ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్​ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది ప్రియాంక. ఇందులో నికో జోనాస్​, ప్రియాంక సంప్రదాయ దుస్తులు ధరించి పూజలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ దంపతుల ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా, నికో జోనాస్​, ప్రియాంక ఫొటోలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సంప్రదాయాలను అసలు మర్చిపోని ప్రియాంకను ప్రశంసలతో ముంచెత్తారు. ఇటువంటి వారు భారత్​కు అసలైన బ్రాండ్​ అంబాసిడర్ అంటూ కామెంట్స్​ చేస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version