శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదంపై అనుమానం?

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కేంద్రంలోపల 9మంది చిక్కుకొని ఉండడంతో ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతోంది. శ్రీశైలం పేలుళ్లు   ప్రమాదమా? కుట్ర అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై చర్చ మొదలైంది. Also Read : ఏపీ కంటే తెలంగాణకే బీజేపీ చూపు.. ఎందుకు? గతంలో ప్రాజెక్టు నుంచి నీటి తరలింపు కోసం కొత్త ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని వైసీపీ […]

Written By: Neelambaram, Updated On : August 21, 2020 3:33 pm
Follow us on

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కేంద్రంలోపల 9మంది చిక్కుకొని ఉండడంతో ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతోంది. శ్రీశైలం పేలుళ్లు   ప్రమాదమా? కుట్ర అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై చర్చ మొదలైంది.

Also Read : ఏపీ కంటే తెలంగాణకే బీజేపీ చూపు.. ఎందుకు?

గతంలో ప్రాజెక్టు నుంచి నీటి తరలింపు కోసం కొత్త ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం మొదలైంది. పోతిరెడ్డిపాడు నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమకు రోజుకు మూడు టీఎంసీల నీటిని సరఫరా చేసేలా ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 203 ను తీసుకువచ్చింది. అంతేకాదు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పరిపాలన అనుమతి కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల మధ్య వివాదం మొదలైంది. అయితే ప్రస్తుతం శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో ప్రమాదంపై రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. నిజంగా ప్రమాదం జరిగిందా? లేదంటే కుట్ర జరిగిందా అని ప్రశ్నించారు.  పొరుగు రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ కి.. సీఎం కేసీఆర్ సహకరిస్తున్నారని ఆరోపించారు. జగన్ జలదోపిడీకి కేసీఆర్ హెల్ప్ చేస్తున్నారని.. అందుకే ఈ  ప్రమాదం జరిగిందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రమాదాన్ని బట్టి చూస్తే విద్యుత్ ప్రాజెక్టులను చంపే కుట్ర జరుగుతోందని రేవంత్ ఆరోపించారు. కుట్రను ప్రమాదం పేరుతో కప్పి ఉంచే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంపై నిజనిజాలు తెలియాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు.  అప్పుడు జరిగింది ప్రమాదమో.. కుట్ర తెలుస్తోందని ఆరోపించారు. కాగా రేవంత్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ సర్కార్ ఇంతవరకు స్పందించలేదు.

Also Read : మిసెస్‌ గ్లోబల్‌ షో టాపర్‌గా హైదరాబాదీ యువతి