Buchi Babu : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు పాన్ ఇండియా సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో తెలుగు సినిమా హీరోలు సైతం ఎక్కడ తగ్గకుండా భారీ సినిమాలను చేస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీనే అనే రేంజ్ లో మన వాళ్ళు సక్సెస్ లను సాధిస్తుండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారో చూడాలి….
సినిమా ఇండస్ట్రీలో వారసత్వంగా వచ్చిన నటులు స్టార్ హీరోలుగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరు నెపో కిడ్స్ కావడం వల్ల స్టార్ స్టేటస్ ని అనుభవిస్తున్నారని కొందరు అంటుంటే, మరి కొంతమంది మాత్రం వారసత్వం ఉన్నప్పటికి వాళ్ళు వాళ్ళ సొంత టాలెంట్ తో ఎదిగి స్టార్ స్టేటస్ ని అందుకున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి హీరోలకు మొదటి సినిమా అవకాశం రావడానికి వారసత్వం అనేది ఉపయోగపడుతుందేమో కానీ వాళ్ళను స్టార్ హీరోలను చేయడం అనేది వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే తప్ప ఎవరూ అలాంటి ఇమేజ్ ను అంత ఈజీగా అయితే అందుకోలేరు. ఇక ఇదిలా ఉంటే నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సైతం తన సొంత టాలెంట్ తో స్టార్ హీరో రేంజ్ కి వెళ్ళిపోయాడు. ఇంక తనతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన నందమూరి ఫ్యామిలీ హీరోలు సైతం పెద్దగా ఆకట్టుకోలేక ఫేయిడ్ ఔట్ అయిపోయిన దశలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం నందమూరి ఫ్యామిలీ బాధ్యతలను తన భుజాల మీద మోసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ఇదిలా ఉంటే ఉప్పెన సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు ఆ సినిమాకి ముందు సుకుమార్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక నాన్నకు ప్రేమతో సినిమా చేస్తున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కావాలనే బుచ్చిబాబుతో గొడవ పెట్టుకొని తనని ఎత్తుకెళ్లి మరి స్విమ్మింగ్ పూల్ లో ఎత్తేసాడు.
దాంతో బుచ్చిబాబు వాటర్ చాలా చల్లగా ఉంది సార్ అనుకుంటూ బయటికి వచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మరి ఏది ఏమైనా కూడా బుచ్చిబాబు ప్రస్తుతం రామ్ చరణ్ తో ఒక భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.
Also Read : ఏడేళ్ల తర్వాత హైదరాబాద్ జట్టు విజేతగా.. బుచ్చిబాబు టోర్నీలో సంచలనం..
ఇక ఉప్పెన సినిమా 100 కోట్లు కలెక్షన్లను రాబట్టడంతో ఆయన తన తదుపరి ప్రాజెక్టును రామ్ చరణ్ తో చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని బుచ్చిబాబు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక దానికి అనుగుణంగానే సినిమాను తెరకెక్కిస్తున్నాడు…