Buchi Babu and Chiranjeevi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) అభిమానులు ప్రస్తుతం #RC16 మూవీ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) చిత్రం ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలై బోల్తా కొట్టింది. ఈ సినిమా రామ్ చరణ్ అభిమానులకు, మెగా అభిమానులకు ఒక పీడకల. ఆ పీడకల నుండి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది అనే ఉద్దేశ్యంలో ఉన్నారు. రామ్ చరణ్ అనేక ఇంటర్వ్యూస్ లో ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పాడు. నా కెరీర్ లో ఈ చిత్రం ‘రంగస్థలం’ ని మించిన సినిమా అవుతుందని బల్ల గుద్ది మరీ చెప్పాడు. రెగ్యులర్ షూటింగ్ కూడా శరవేగంగా సాగుతుంది. ఎట్టి పరిస్థితిలోనూ ఈ అక్టోబర్ నెలలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
Also Read : బుచ్చిబాబు సినిమా కోసం 10 కిలోలు తగ్గనున్న రామ్ చరణ్…ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు…
అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కోసం ఒక కీలకమైన పాత్రని డైరెక్టర్ బుచ్చిబాబు(Buchi Babu Sana) రాసినట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. అతిథి పాత్రనే అయినప్పటికీ సినిమా కథ ని మరో లెవెల్ కి తీసుకెళ్లే విధంగా ఆ క్యారక్టర్ ఉంటుందట. మెగా అభిమానులకు ఈ సన్నివేశం ఒక విజువల్ వండర్ గా ఉండబోతుందని టాక్. త్వరలోనే మెగాస్టార్ పాత్రకు సంబంధించిన అధికారిక ప్రకటన మూవీ టీం సోషల్ మీడియా ద్వారా చేయబోతుందట. గతంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఆచార్య’ చిత్రం ఎంతటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. అభిమానులు జీవితాంతం మర్చిపోలేని పీడకలల్లో ఇది కూడా ఒకటి. అలాంటి సినిమా తర్వాత మళ్ళీ వీళ్లిద్దరు కలిసి కనిపించబోతున్నారు. గతంలో కూడా చిన్న చిన్న అతిథి పాత్రల ద్వారా చిరంజీవి రామ్ చరణ్ సినిమాల్లో కనిపించాడు.
రామ్ చరణ్ రెండవ చిత్రం ‘మగధీర’ లో, అదే విధంగా ‘బ్రూస్లీ- ది ఫైటర్’ చిత్రాల్లో కనిపించాడు. రామ్ చరణ్ కూడా మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ‘ఖైదీ నెంబర్ 150’ లోని ‘అమ్మడు..కుమ్ముడు’ సాంగ్ లో కనిపించాడు. వీటిల్లో ‘మగధీర’, ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాల ఫలితాల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. #RC16 కూడా ఆ రేంజ్ హిట్ అవుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు ఫ్యాన్స్. ఇప్పటికే రెండు కీలక షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, వచ్చే నెలలో ఢిల్లీ లో జరగబోయే మూడవ షెడ్యూల్ ని ప్రారంభించుకోనుంది. ఈ చిత్రం లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటించనున్నాడు. ఇప్పటి వరకు ఆయన షెడ్యూల్స్ లో పాల్గొనలేదు కానీ, తదుపరి షెడ్యూల్ నుండి పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Also Read : రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా కథలో మార్పులు చేస్తున్న చిరంజీవి…