Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) కి సౌత్ లో తమిళ సినిమా ఇండస్ట్రీ తర్వాత అతి పెద్ద మార్కెట్ ఏదైనా ఉందా అంటే అది మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నే. ఇక్కడ ఒకప్పుడు ఆయనకు స్టార్ హీరోలతో సమానమైన ఓపెనింగ్స్ వచ్చేవి. బాషా , నరసింహా, ముత్తు,అరుణాచలం, చంద్రముఖి,శివాజీ, రోబో,జైలర్ ఇలా ఆయన హీరో గా నటించిన ఎన్నో సినిమాలు తెలుగు లో సూపర్ హిట్స్ గా నిలిచాయి. అయితే ఈమధ్య కాలం లో రజినీకాంత్ రేంజ్ బాగా తగ్గింది. మన తెలుగు లో రోబో తర్వాత రజినీకాంత్ నటించిన సూపర్ హిట్ చిత్రం ఏదైనా ఉందా అంటే అది జైలర్ మాత్రమే. మధ్యలో విడుదలైన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇక జైలర్ తర్వాత విడుదలైన లాల్ సలామ్, వెట్టియాన్ చిత్రాలు కూడా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. తమిళంలో కూడా అదే పరిస్థితి.
Also Read : రజినీకాంత్ ‘కూలీ’ టీజర్ విడుదల తేదీ ఖరారు..టీజర్ లోని డైలాగ్స్, మెయిన్ హైలైట్స్ ఇవే!
ఇప్పుడు సౌత్ మొత్తం ఆయన మార్కెట్ కి పూర్వ వైభవం తెచ్చి పెట్టే ఏదైనా ఉందా అంటే, అది కూలీ(Coolie Movie) నే. లోకేష్ కనకరాజ్(Lokesh Kanakaraj) దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. లోకేష్ కనకరాజ్ అంటే యూత్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ వేరు. అలాంటి డైరెక్టర్ కి రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ తోడైతే అగ్ని కి వాయువు తోడైనట్టే. అందుకే కూలీ చిత్రానికి తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం నిర్మాతలు పోటీ పడుతున్నారు. తెలుగు రైట్స్ ని 40 కోట్ల రూపాయలకు ఒక ప్రముఖ నిర్మాత కొనుగోలు చేసాడని టాక్. త్వరలోనే ఆ నిర్మాత ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన చేయబోతున్నాడు. నాగవంశీ నే ఈ సినిమా రైట్స్ కొన్నాడని టాక్ ఉంది, కానీ ఇంకా స్పష్టత రాలేదు. థియేట్రికల్ రైట్స్ అయితే 40 కోట్లకు అమ్ముడుపోయింది.
టాక్ వచ్చినా, రాకపోయినా కేవలం వీకెండ్ లోనే రికవరీ అయిపోతుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. వరుసగా రెండు ఫ్లాప్స్ వచ్చినప్పటికీ కూడా ఈ రేంజ్ లో థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం అంటే రజినీకాంత్ రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇకపోతే ఈ చిత్రానికి అనిరుద్(Anirudh Ravichander) సంగీతం అందించగా, శృతి హాసన్(Sruthi Hassan) హీరోయిన్ గా నటించింది. అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), ఉపేంద్ర(Upendra) వంటి వారు ముఖ్య పాత్రలు పోషించగా, పూజా హెగ్డే(Pooja Hegde) ఐటెం సాంగ్ చేసింది. ఇలా భారీ తారాగణంతో, భారీ టెక్నీకల్ విలువలతో ఈమధ్య కాలంలో సినిమా విడుదలై చాలా కాలం అయ్యింది. లోకేష్ కనకరాజ్ ఈ సినిమాని అంచనాలకు తగ్గట్టుగా తీసి ఉంటే ఆకాశమే హద్దు అనే రేంజ్ లో వసూళ్లు వస్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ నెల 14 న లోకేష్ కనకరాజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి టీజర్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read : రజినీకాంత్ కూలీ సినిమాలో చిరంజీవి నటిస్తున్నాడా..? ఇంతకీ ఆయన ఏ పాత్ర చేస్తున్నాడు…