Buchi Babu next project update: ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు ప్రస్తుతం పెద్ది సినిమాతో మరోసారి తన హవాని కొనసాగిస్తున్నాడు. ఈరోజు రిలీజ్ అయిన పెద్ది సినిమా రిలీజైన అన్ని సెంటర్లలో పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు బుచ్చిబాబు ఈ సినిమాతో రామ్ చరణ్ కి ఒక సక్సెస్ ను కట్టబెట్టాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా బుచ్చిబాబు తన తర్వాత సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించాలని ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇప్పటికే ఆయన షారుక్ ఖాన్ తో తన తదుపరి సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తున్నాడు.
కాబట్టి అతనికి ఒక కథను కూడా వినిపించారట. షారుక్ ఖాన్ ఆ కథకి ఇంప్రెస్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే పెద్ది సినిమా ఈరోజు రిలీజ్ అయి పాజిటివ్ టాక్ సంపాదించుకోవడంతో షారుక్ ఖాన్ బుచ్చిబాబుతో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాట్టుగా తెలుస్తుంది.
నిజానికి బుచ్చిబాబుకు ఒక మంచి ఆపర్చునిటి దొరికింది. ఎందుకంటే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ తో సినిమా చేసే అవకాశం అందరికి రాదు. అలాంటిది బుచ్చిబాబును ఏరీకోరి మరి అతను సెలెక్ట్ చేసుకున్నాడు అంటే అతనిలో ఏదో ఒక టాలెంట్ అయితే తను గుర్తించే ఉంటాడు. ఇక మొత్తానికైతే ఇప్పుడు పెద్ది సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతుంది. కాబట్టి బుచ్చిబాబు తన నెక్స్ట్ ప్రాజెక్టు మీద ఎక్కువగా ఫోకస్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
అలాగే షారుక్ ఖాన్ తో తన సినిమా ఉండబోతున్నట్టుగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ తొందర్లోనే రాబోతుంది. ఇక ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ గా ఎవరు వ్యవహరిస్తున్నారనే విషయంలో క్లారిటి లేదు. కానీ మొత్తానికైతే సుకుమార్ వల్లే బుచ్చిబాబు ఈ సినిమాకి కమిటైయినట్టుగా తెలుస్తుంది…ఇక ఏది ఏమైనా కూడా పెద్ది సినిమా కోసం బుచ్చిబాబు ఎంతలా కష్టపడ్డాడో తన గురువు అయిన సుకుమార్ సైతం అదే రేంజ్ లో కష్టపడి తన శిష్యుడికి ఒక మంచి సినిమాని అందించాలనే ప్రయత్నం చేశాడు. ఇక వీళ్లిద్దరితో పాటు రామ్ చరణ్ కూడా ఈ సినిమా కోసం తన సర్వస్వాన్ని దారపోశాడనే చెప్పాలి…
