Adhire Abhi: జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యాడు. ఆయన చేతికి తీవ్ర గాయాలు కాగా 15 కుట్లు పడినట్లు తెలుస్తుంది. అదిరే అభి హీరోగా ఓ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. నేడు అదిరే అభిపై యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుండగా ప్రమాదం జరిగింది. ఫైటర్ ని కొట్టే క్రమంలో పదునైన వస్తువు అదిరే అభి చేతికి తగిలింది. శరీరం కట్ కావడంతో అదిరే అభిని దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. గాయానికి దాదాపు 15 కుట్లు పడ్డాయట. దీంతో అభి కోలుకునే వరకు షూటింగ్ కి బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి.

కమెడియన్ గా వెండితెరకు పరిచయమైన అదిరే అభి మొదటి చిత్రం ఈశ్వర్. 2002లో విడుదలైన ఈ చిత్రం ప్రభాస్ డెబ్యూ మూవీ కావడం విశేషం. ఆ మూవీలో ప్రభాస్ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఒకడిగా అభి చేశాడు. తర్వాత విష్ణు, విద్యార్థి, గౌతమ్ ఎస్ ఎస్ సి, ఈగ చిత్రాల్లో నటించారు. అభి హీరోగా పాయింట్ బ్లాక్ టైటిల్ తో 2021లో ఓ మూవీ విడుదలైంది. ఆ చిత్రంలో అభి పోలీస్ రోల్ చేశాడు.

ఇక అదిరే అభికి జబర్దస్త్ ఫేమ్ తెచ్చిపెట్టింది. అడపాదడపా అవకాశాలతో నెట్టుకొస్తున్న అభికి 2013లో ప్రారంభమైన జబర్దస్త్ కామెడీ షోలో అవకాశం దక్కింది. టీం లీడర్ గా అదిరే అభి పేరుతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. అదే సమయంలో పరిశ్రమలో నటుడిగా,అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం జబర్దస్త్ మానేసిన అభి… స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ షోకి వెళ్ళాడు. ఆ షో జడ్జిగా నాగబాబు వ్యవహరిస్తున్న నేపథ్యంలో అక్కడ టీం లీడర్ గా చేస్తున్నాడు. జబర్దస్త్ లోని 70 శాతం కమెడియన్స్ ఇప్పుడు కామెడీ స్టార్స్ ఉండటం విశేషం.