Bro Movie Overseas: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది అవతార్’ ఈ నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్, మరియు పాటలు విడుదలయ్యాయి. టీజర్ కి అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ రాగా, పాటలకు మాతరం మిశ్రమ స్పందనే లభించింది.
దీంతో అభిమానులు ఇప్పుడు ట్రైలర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ట్రైలర్ లో సరైన కంటెంట్ పడితే ‘బ్రో ది అవతార్’ చిత్రం మీద ఉన్న హైప్ అమాంతం పెరుగుతుందని, పాటల వల్ల వచ్చిన నెగటివిటీ మొత్తం మటాష్ అవుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు. ఇక నిన్న ఈ చిత్ర నిర్మాత బేబీ మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొనగా, అక్కడ అభిమానులు ‘బ్రో ది అవతార్’ ట్రైలర్ గురించి అడగగా, ఈ నెల 21 వ తారీఖున విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పుకొచ్చాడు.
ఇక ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రారంభం అయ్యాయి. అమెరికా , లండన్ , ఆస్ట్రేలియా, యూరోప్ వంటి దేశాలలో బుకింగ్స్ ప్రారంభం అవ్వగా, ఒక్కసారి వాటి ట్రెండ్ ఎలా ఉందో చూద్దాము. అమెరికాలోని ‘డల్లాస్’ ప్రాంతం లో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి మూడు షోస్ హౌస్ ఫుల్స్ అయ్యాయి. ఈ మూడు షోస్ నుండి దాదాపుగా ఆరు వేల డాలర్లు వచ్చాయి. అదనంగా మరో నాలుగు షోస్ ని కాసేపటి క్రితమే యాడ్ చేసారు. ఇవి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ నేటి సాయంత్రానికి అత్యధిక టికెట్స్ అమ్ముడుపోతాయని.
పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ ఈ శనివారం నుండి ప్రారంభిస్తారని చెప్తున్నారు. కేవలం అమెరికా నుండి ఫైనల్ ప్రీమియర్ షోస్ గ్రాస్ కచ్చితంగా 8 లక్షల డాలర్లు దాటుతాయని అంటున్నారు, మరో పక్క లండన్ లో కూడా కాసేపటి క్రితమే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా , వెయ్యికి పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. వీటి నుండి నాలుగు వేల డాలర్లు వచ్చినట్టు సమాచారం. అలా కనీసం ట్రైలర్ కూడా లేకుండా ఈ స్థాయి బుకింగ్స్ జరగడాన్ని చూస్తుంటే పవర్ స్టార్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.