Brides Wanted: ఈ సమాజం ఎటు పోతుందని రోజూ సాంప్రదాయవాదులు తలలు పట్టుకుంటున్నారు. సొసైటీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఒకప్పటి జనరేషన్ ని షాక్ కి గురి చేస్తున్నాయి. విశాలధృక్పదం పేరుతో అమ్మాయిలు, అబ్బాయిల మధ్య రిలేషన్స్, వాళ్ళ అలవాట్లు, ఆలోచించే తీరు కొన్ని సందర్భాల్లో హద్దులు దాటేస్తుంది. బిగ్ బాస్ లాంటి షో ఓ 30-40 ఏళ్ల క్రితం వస్తే పరిస్థితి ఏమిటో ఊహించుకోండి. వయసులో ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు ఒకే ఇంట్లో ఉండడం, ఒకే బెడ్ పై పడుకోవడం, స్నేహం, ప్రేమ పేరుతో పబ్లిక్ గా కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడాలు.. వంటివి ఆ జెనరేషన్ ఒప్పుకునేదా?, అలాగే కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇలాంటి షోని చూసేవారా? నో వే..

కానీ ఇప్పుడు మనం ఆ షోని ఇంటిల్లిపాది కలిసి కూర్చొని చూస్తున్నాం. దీనికి మనం పెట్టుకున్న పేరు కల్చర్, బ్రాడ్ మైండ్. మనం ఇలాంటి వాతావరణంలో పిల్లలను పెంచితే పెద్దయ్యాక వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్పడానికి తాజా సంఘటన ఉదాహరణ. పెళ్లి కానీ ఓ కుర్రాడు, అమ్మాయి కోసం మాట్రిమోని సంస్థకు మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ లో అమ్మాయికి ఉండవలసిన క్వాలిటీస్ ఏమిటో పొందుపరిచారు.
Also Read: పెళ్లయిన తొలినాళ్లలో ఎలా ఉండాలంటే..?
ఆ కుర్రాడు కోరిన లక్షణాలతో సదరు మాట్రిమోని సంస్థ యాడ్ ప్రచురించగా, అది చూసిన వారందరూ… షాక్ తిన్నారు. సాధారణంగా క్వాలిటీస్ అంటే ఎత్తు, కలరు, బరువు, చదువు, కులం, గోత్రం ఉంటాయి. కానీ ఈ మహానుభావుడు ఏకంగా నడుము నుండి బ్రా సైజు వరకు… మొత్తం షోరూమ్ లో కొత్త కార్ కి ఆర్డర్ ఇచ్చినట్లు ఇచ్చాడు. ఆమె హైట్ , వెయిట్ తో పాటు నడుము సైజు, బ్రా సైజు కూడా మెన్షన్ చేశాడు. మనోడి కోరికలు అంతటితో ఆగిపోలేదు, బెడ్ పైన ఒంటిపై బట్టలు ఉండాలని, కుక్కలు అంటే ఇష్టపడాలని, పిల్లలు వద్దనుకోవాలి అంటూ మరికొన్ని దారుణమైన కోరికలు కోరాడు. వాడు అడిగితే అడిగాడు, దాన్ని యాడ్ రూపంలో ప్రచురించిన సంస్థను నెటిజెన్స్ బండ బూతులు తిడుతున్నారు. ఈ యాడ్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
Also Read: భర్తతో స్పెయిన్లో ఎంజాయ్ చేస్తున్న నిహారిక