Population In India: ప్రపంచంలో జనాభా విస్పోటనం పెరిగిపోతోందని భయాందోళనలు వస్తున్న తరుణంలో భారత్ లో మాత్రం తగ్గుతున్నట్లు తెలుస్లోంది. జనాభా నియంత్రణ పథకంలో భాగంగా ప్రతి ఇంటిలో ఇద్దరు పిల్లలకే పరిమితం కావడంతో జనాభా క్రమంగా తగ్గుతోంది. జనాభాలో చైనా తరువాత స్థానంలో ఉన్న ఇండియా మరి కొద్ది రోజుల్లో జనాభా నియంత్రణపై పట్టు సాధించి తన స్థానాన్ని తగ్గించుకోనున్నట్లు తెలుస్తోంది. భారతీయ మహిళల్లో సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుతుండటంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ ఐదో ఎడిసన్ సర్వే ఆసక్తికర విషయాలు వెల్లడిస్తోంది. దేశంలో సంతానోత్పత్తి రేటు 2గా నమోదవుతోందని తెలుస్తోంది. సగటు భారతీయ మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. దీంతోనే జనాభా క్రమంగా తగ్గుతోందని సమాచారం. సంతానోత్పత్తిలో ఈ మార్పులు శుభ పరిణామమే అని నిపుణలు వెల్లడిస్తున్నారు.
Also Read: ట్విట్టర్ నుంచి ఎగ్జిట్: హనుమ విహారి-ఎన్టీఆర్ ట్రస్ట్ మధ్య గొడవేంటి?
దేశంలో జనన, మరణాల్లో తగ్గుదల కనిపిస్తోంది. సంతానోత్పత్తి రేటు అంతకంటే తక్కువగా ఉండటంతో జనాభా తగ్గుదల సాధ్యమవుతోందని సమాారం. గతంలో భారతీయ మహిళలు తమ జీవితకాలంలో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చినా ప్రస్తుతం పరిస్థితిలో మార్పులు రావడం తెలిసిందే. కానీ తరువాత కాలంలో ఈ సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది.
ఈశాన్య స్టేట్లు మేఘాలయ, మణిపూర్, బిహార్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్ లలో సంతానోత్పత్తి ఎక్కువగా ఉన్నా దేశంలోని మిగతా ప్రాంతాల్లో మాత్రం తగ్గుదల కనిపిస్తోంది. దేశంలోనే అత్యల్ప సంతానోత్పత్తి సిక్కింలో నమోదైనట్లు తెలుస్తోంది. లడ్డాఖ్ లో కూడా గణనీయంగా తగ్గింది. దీంతో దేశంలో జనాభా తగ్గుదలకు అధికారులు చేసిన ప్రయత్నాలు సఫలం అవుతున్నట్లు సమాచారం.
Also Read: ఆశల్లేని వేళ కేబినెట్ లోకి.. జగన్ సర్ ప్రైజ్