https://oktelugu.com/

Agent movie OTT : ‘ఏజెంట్‌’కు ఎన్ని కష్టాలో.. చివరకు ఓటీటీ రిలీజ్‌కు కూడా బ్రేక్‌! కారణం ఏంటో తెలుసా?

ఖిల్‌ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ఓటీటీ రిలీజ్‌పై అనిశ్చితి నెలకొంది. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్, ఓటీటీ సంస్థలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Written By:
  • NARESH
  • , Updated On : September 28, 2023 / 06:53 PM IST

    Agent-Movie-OTT-Date-2023

    Follow us on

    Agent movie OTT : అక్కినేని అఖిల్‌.. పరిచయం అక్కరలేదు.. అక్కినేని అనగానే నాగార్జున వారసుడు అని గుర్తొస్తుంది. ఏడాది వయసులోనే సినీ వారసుడిగా తెరంగేట్రం చేశారు. సిసింద్రీ సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు అఖిల్‌. పెద్దయ్యాక మంచి లవర్‌ బాయ్‌లా తయారయ్యాడు. అన్నయ్య నాగచైతన్యతో పోల్చితే అఖిలే అందంగా కనిపిస్తాడు. అయితే అన్నయ్యకు వచ్చిన సక్సెస్‌లు కూడా అఖిల్‌కు రావడం లేదు. స్టోరీల సెక్షనా… కథ, కథనమా, లేక అఖిల్‌ గ్రహచారమా తెలియదు కానీ, సినిమాలకు మంచి టాక్‌ వస్తున్నా సూపర్‌ హిట్‌ కావడం లేదు. ఇప్పటి వరకు ఎనిమిది సినిమాల్లో అఖిల్‌ నటించాడు. సిసింద్రి తర్వాత ఆస్థాయి సూపర్‌ హిట్‌ సినిమా ఒక్కటి కూడా లేదు. గతేడాది వచ్చిన ఏజెంట్‌ మీద ఎన్నో ఎక్స్‌పెక్ట్స్‌ పెట్టుకున్నాడు. కానీ అదీ డిజాస్టర్‌గానే మిగిలింది. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్, మిస్టర్‌ మజ్ను, హలో, ఆటాడుకుందాంరా, అఖిల్‌ సినిమాలు ఏమీ అఖిల్‌కు బ్రేక్‌ ఇవ్వలేదు. మనంలో చేసినా అది నాగార్జునకే పేరు తెచ్చింది.

    ఏజెంట్‌కు ఆటంకాలు..
    ఎన్నో ఎక్ప్‌క్టేషన్స్‌తో అఖిల్‌ ఏజెంట్‌ సినిమా తీశాడు. ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు కూడా. పూర్తిగా మేకోవర్‌ అయ్యాడు. ఆ సినిమా 2023, ఏప్రిల్‌ 28న విడుదలైంది. ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ఫ్లాప్‌గా నిలిచింది. థియేటర్లలో కొన్ని రోజులకే మాయమైంది. ఆ తర్వాత మూడు వారాలకే ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్‌ అధికారికంగా ప్రకటించింది. అయితే ఏమైందో తెలియదు కానీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ను వాయిదా వేశారు.

    ఏజెంట్‌ను వెంటాడుతున్న కష్టాలు..
    అక్కినేని అఖిల్‌ నటించిన ’ఏజెంట్‌’ సినిమాను కష్టాలు వీడడం లేదు. మేలో ఓటీటీలో రిలీజ్‌ చేస్తామని వార్తలు వచ్చినా రూమర్లుగానే మిగిలిపోయాయి. అయితే ఎట్టకేలకు శుక్రవారం (సెప్టెంబర్‌ 29) నుంచి ఏజెంట్‌ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు మళ్లీ అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడీ రిలీజ్‌ కూడా ఆగిపోయింది.

    కోర్టుకు ఎక్కిన డిస్ట్రిబ్యూటర్‌..
    ఓటీటీ రిలీజ్‌పై కోర్టు స్టే విధించింది. ఏజెంట్‌ సినిమా డిస్ట్రిబ్యూషన్‌ విషయంలో నిర్మాత అనిల్‌ సుంకర తనని మోసం చేశాడంటూ విశాఖ పట్నానికి చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ బత్తుల సత్యనారాయణ (వైజాగ్‌ సతీశ్‌) న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులో పిటిషన్‌ కూడా వేశారు. ఆయన వాదనలు విన్న కోర్టు ఏజెంట్‌ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌పై స్టే ఇచ్చింది. ఈ విషయాన్ని సతీష్‌ బత్తుల లాయర్‌ మీడియాకు తెలిపారు. దీంతో అఖిల్‌ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ఓటీటీ రిలీజ్‌పై అనిశ్చితి నెలకొంది. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్, ఓటీటీ సంస్థలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.