https://oktelugu.com/

Hyderabad : హైదరాబాద్ నడిబొడ్డుకొచ్చాయి.. వణికిస్తున్న ఆ జంతువులు!?

అయితే, అంతకుముందు కూడా హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో మొసళ్లు, పాములు కనిపించాయి. తాజాగా.. కురిసిన భారీ వర్షంతో మొసలి కనిపించడం స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : September 28, 2023 / 07:05 PM IST
    Follow us on

    Hyderabad : విశ్వనగరం హైదరాబాద్‌.. అభివృద్ధిలో దేశంలోనే నంబర్‌ వన్‌.. పెట్టుబడులకు స్వర్గధామం.. సకల మతాలకు నిలయం.. తరలి వస్తున్న విదేశీ కంపెనీలు.. ఇదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌ భాగ్యనగరం గురించి చెప్పే మాటలు. కానీ పెట్టుబడులు, కార్పొరేట్‌ కంపెనీలతోపాటు విశ్వనగరంలోకి అవి కూడా వస్తున్నాయి. తొలిసారిగా కనిపించిన ఆ నల్లటి జంతువును చూసి జనం పరుగో.. పరుగు అంటూ పారిపోయే పరిస్థితి నెలకొంది. ఇంతకీ అదేంటో చెప్పలేదు కదూ.. మొసలి పిల్ల. ఇన్నాళ్లు వర్షం కురిస్తే ఇళ్లలోని వరద నీటు, చెత్త చెదారంతోపాటు పాములు, తేళ్లు మాత్రమే వచ్చేవి. ఇప్పుడు మొసలి పిల్లలు కూడా వస్తున్నాయి. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం కురిసిన భారీ కురిసిన వర్షానికి.. నాలాలో ఓ మొసలి కనిపించడం అలజడి రేపింది. ఖైరతాబాద్‌లోని ఆనంద్‌నగర్‌ – చింతల్‌బస్తీ మధ్య కొత్తగా నిర్మిస్తున్న వంతెన వద్ద మొసలి పిల్ల ప్రత్యక్ష్యమైంది.

    వానొస్తే వణుకే..
    కొన్నేళ్లుగా వానొస్తే విశ్వనగరం హైదరాబాద్‌ చిగురుటాకులా వనుకుతోంది. వరద రోడ్లను ముంచెత్తుతోంది. అభివృద్ధి పేరుతో ఆక్రమణలు పెరగడంతో చెరువుల్లోకి చేరాల్సిన నీరు ఇళ్లను ముంచెత్తుతోంది. ఇక ట్రాఫిక్‌ కష్టాలు అయితే వర్ణనాతీతం. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్‌ మహా నగరం అతలాకుతలమైంది. దీంతో పాములు, తేళ్లు, ఇతర విష పురుగులు జనవాసాల్లోకి చేరాయి. బుధవారం మాత్రం ఓ మొసలి పిల్లే కొట్టుకొచ్చింది.

    స్థానికుల్లో భయాందోళన..
    అయితే నాలాలో కొట్టుకువచ్చిన మొసలిని చూసి జనం భయాందోళనకు గురయ్యారు. సెడన్‌గా మొసలిని చూసి స్థానికులు పరుగులు తీశారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చే లోపే మొసలి పక్కనే ఉన్న నాలాలోకి దూసుకెళ్లిందింది. అదే దారిలో గణేశ్‌ మండపం ఉండటంతో స్థానికుల్లో మరింత భయం అలుముకుంది. అయితే మొసలి నాలా గోడలు, మెటల్‌ రాడ్ల మధ్య ఇరుకైన మార్గంలో ఇరుక్కుపోయింది. రాత్రి 7 గంటలకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు మొసలిని రెస్క్యూ చేసేందుకు గంటలపాటు శ్రమించారు. పోలీసు, అటవీ, డీఆర్‌ఎఫ్‌కు చెందిన దాదాపు 20 మంది అధికారుల బృందం మెటల్‌ రాడ్లను మధ్య ఉన్న మొసలిని బయటకు తీశారు. దానిని జూకి తరలించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

    నత్తనడకన నాలా పనులు..
    నాలపై నిర్మాణ పనులు మూడు నెలలుగా కొనసా…గుతున్నాయి. అదే ప్రాంతంలో మొసలి పిల్ల కొట్టుకురావడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలాల్లో ముసలి పిల్ల ఒకటే ఉందా? లేక దాని తల్లి ఏమైనా ఉందా..? ఇంకా ఎన్ని కొట్టుకు వచ్చాయి? అనే దానిపై అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ముసలి పిల్ల ప్రస్తుతం ఎక్కడ నుంచి కొట్టుకు వచ్చిందని దానిపై అధికారులు దృష్టి పెట్టారు. అయితే, అంతకుముందు కూడా హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో మొసళ్లు, పాములు కనిపించాయి. తాజాగా.. కురిసిన భారీ వర్షంతో మొసలి కనిపించడం స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.