Bramhanandam
Bramhanandam : సినిమాల్లోకి కమెడియన్లు ఎంతోమంది వస్తుంటారు.. పోతుంటారు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంటారు. అలాంటి గొప్ప కమెడియన్లలో బ్రహ్మానందం ఒకరు. గత 40 ఏళ్లుగా ఆయన తన హాస్యంతో ఎంతోమందిని నవ్వించారు.. ఇంకా నవ్విస్తూనే ఉన్నారు. తెరమీద ఆయన నటనతో కొన్నిసార్లు ఏడిపించారు.. ఇప్పటికీ దిగ్విజయంగా సినిమాలు చేస్తూ కొనసాగుతున్నారు. ఇటీవలే ఆయన 69వ పడిలోకి అడుగుపెట్టారు. మనందరం నవ్వడం కోసం ఆ బ్రహ్మ… ఆనందంలో ఉన్నప్పుడు ఓ మనిషిని పుట్టించగా అతడే బ్రహ్మానందం అయ్యాడేమో. తెలుగు వాళ్లు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో గానీ.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి బ్రహ్మానందం దొరికాడు. బాధలను మరిచిపోవాలన్నా, జనాలు నవ్వాలన్నా ఆయన ఒక్కసారి తెరమీద కనపడితే చాలు పేజీల పేజీల స్క్రిప్టులు అక్కర్లేదు, ఆయన ఒక్క ఎక్స్ప్రెషన్ చాలు అని ఎన్నో సార్లు ఎన్నో సినిమాల్లో ప్రూవ్ చేసుకున్నారు. 40 ఏళ్లకు పైగా మన అందరినీ నవ్విస్తూనే ఉన్నారు.
బ్రహ్మానందం ఉన్న సినిమా చూస్ చేసుకుని వెళ్లే వాళ్లు లేకపోలేదు. సినిమాకి వెళ్తే ఆ సినిమాలో అందులో బ్రహ్మానందం ఉండాలి అనుకుంటాం. కానీ ఇటీవల ఆయన సినిమాలు చాలా తగ్గించేశారు. అయితే మనం రోజూ సోషల్ మీడియాలో బోల్డన్ని మీమ్స్ చూస్తుంటాం. అందులో ఎక్కువగా బ్రహ్మానందం ఫేస్ తోటే ఉంటున్నాయి. బ్రహ్మానందం లేకపోతే మీమ్స్ లేవు. ఇది మీమర్స్ కూడా ఒప్పుకుంటారు. బ్రహ్మానందం కూడా తన ఫొటోలతో ఉన్న మీమ్స్ చేసి సరదగా ఫీల్ అవుతుంటారు. గతంలో కూడా మీమ్స్ చేసే వాళ్లకి ఆయన థ్యాంక్స్ చెప్పారు. కొన్ని కారణాల వల్ల ఇటీవల తాను సినిమాల్లో నటించలేకపోయినా, జనాలు నన్ను మర్చిపోకుండా చేసేది వాళ్లే. నేను వాళ్ళకి రుణపడి ఉంటాను కానీ వాళ్ళ మీద అరవను” అని చెప్పారు బ్రహ్మానందం. ఇప్పుడు ఈ మాటలు కూడా మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మీమర్స్ అంతా బ్రహ్మానందం చెప్పిన ఈ మాటలని పోస్ట్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో మీమ్ గాడ్ గా మారిపోయిన కామెడీ కింగ్ బ్రహ్మానందం మీమర్స్ పై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘నేను 1260కు పైగా సినిమాలు చేశాను. ప్రతి మూవీ, సీన్ నాకు గుర్తులేకపోయినా మీమర్స్ అన్ని మూవీలు చూసి గుర్తుపెట్టుకుంటారు. ఎక్కడెక్కడ ఏ ఎక్స్ప్రెషన్స్ కావాలో రాసి పెట్టుకొని మీమ్స్ తయారుచేస్తారు. అంతటి కృషి, శ్రమ, పూజ మనకోసం చేసేవాడికి నేను గాడ్ అవ్వడంలో తప్పేముంది’ అని చెప్పారు. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బ్రహ్మానందం ఈ మధ్యన సినిమాలు చేయడం తగ్గించారు. చాలా సెలెక్టివ్‌గా, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తున్నారు. అలా తాజాగా బ్రహ్మ ఆనందం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ కలిసి నటించడం, ట్రైలర్లు, టీజర్లు ఆకట్టుకోవడంతో సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి అతిథిగా వచ్చి సినిమా గురించి మాట్లాడటంతో మరింత హైప్ పెరిగింది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం డీసెంట్ టాక్ తెచ్చుకుంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Brahmanandams sensational comments on those who are making memes on him do you know what it is
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com