Brahmanandam: రాంగ్ టైం లో వచ్చి బుక్కైపోయింది ఎఫ్ 3 మూవీ. సక్సెస్ టాక్ తెచ్చుకొని కూడా కాంపిటీషన్ లో నలిగిపోయింది. ఎఫ్3 విడుదలైన వారానికి మేజర్, విక్రమ్ థియేటర్స్ లో దిగాయి. ఈ రెండు హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఎఫ్3 పై ప్రతికూల ప్రభావం పడింది. మంచి ఓపెనింగ్స్ దక్కించుకున్న ఎఫ్3 బ్రేక్ ఈవెన్ కి బారెడు దూరంలో ఆగిపోయింది. నష్టం తగ్గించుకోవడం కోసం టీమ్.. ప్రమోషన్స్ నిర్విరామంగా చేస్తున్నారు. ముఖ్యంగా వెంకటేష్ రిలాక్స్ అవడం లేదు. టీమ్ చెప్పిన వెంటనే వచ్చి ప్రమోషన్స్ లో జాయిన్ అవుతున్నారు.

దీనిలో భాగంగా కామెడీ కింగ్ బ్రహ్మానందంతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి, వెంకటేష్, వరుణ్ తేజ్ లను బ్రహ్మీ తన ప్రశ్నలతో, కామెడీ టైమింగ్ తో ముప్పతిప్పలు పెట్టారు. గతంలో నేను చేసిన మేనరిజమ్స్ కాపీ చేశారు అన్నాడు. చంటి మూవీలో నేను రేచీకటి పాత్ర చేశాను. అహనా పెళ్ళంట మూవీలో నత్తి పాత్ర చేశాను. ఈ రెండు మీరు ఎఫ్3 లో చేశారేంటి? అంటూ ప్రశ్నించారు. ఫన్ కోసం వెంకీ, బ్రహ్మీ మధ్య సరదా గొడవ చోటు చేసుకుంది.
ఈ క్రమంలో బ్రహ్మీ హాస్యనటుడిగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీ సినిమాల్లో కమెడియన్స్ లేకపోయినా పర్లేదు, కామెడీ ఉండేలా మాత్రం చూడండి అన్నారు. కామెడీ చిత్రాలు ఇంకా రావాలి, కామెడీని బ్రతికించాలని బ్రహ్మానందం పరోక్షంగా తెలియజేశారు. అలాగే ప్రత్యేకంగా కమెడియన్స్ ని తీసుకోకున్నా, ఇలా హీరోలతో కామెడీ లాగించేయండి అన్నట్లు ఆయన మాటల అర్థం ఉంది. మ్యూజిక్ డైరెక్టర్స్ స్వయంగా పాటలు పడుకుంటే సింగర్స్ కి పనెక్కడ దొరుకుతుంది. అలాగే హీరోలే కామెడీలు చేసుకుంటే కమెడియన్స్ కి పాత్రలు ఎవడిస్తాడని, బ్రహ్మీ సెటైర్ వేసినట్లుగా కూడా ఉంది.

కాగా బ్రహ్మానందం ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించారు. ఆ మధ్య ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో చాలా కాలం ఇంటికే పరిమితమయ్యారు. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న బ్రహ్మానందం అరుదుగా వెండితెరపై కనిపిస్తున్నారు.ఇటీవల జాతి రత్నాలు మూవీలో జడ్జిగా మెప్పించారు. ఆయన కీలక రోల్స్ చేసిన రంగమార్తాండ, పంచతంత్రం విడుదల కావాల్సి ఉంది.
Also Read:Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఇంటిలో పండగ… పెళ్లి కాకుండానే తండ్రి హోదా!
[…] […]