Brahmamudi Kavya : నాకు ఇంగ్లీష్ రాదు.. చదివింది అదే… బ్రహ్మముడి సీరియల్ కావ్య ఇంత పూర్ స్టూడెంటా!

ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ టాప్ టీఆర్పీ దక్కించుకుంటుంది. బుల్లితెర ప్రేక్షకులకు ఫేవరెట్ సీరియల్ గా మారిపోయింది.

Written By: NARESH, Updated On : January 19, 2024 8:31 pm
Follow us on

Brahmamudi Serial Heroine Kavya : బ్రహ్మముడి సీరియల్ లో కావ్య గా నటిస్తున్న దీపిక రంగరాజు అనతి కాలంలో ఫేమ్ తెచ్చుకుంది. బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ – కావ్యల జంటకి ప్రేక్షకుల నుంచి చెప్పుకోదగ్గ ఆదరణ లభిస్తుంది. ప్రస్తుతం దీపిక బుల్లితెర పాపులర్ స్టార్స్ ఒకరు. దీంతో పాటు స్టార్ మా లో ప్రసారమయ్యే షోస్ లో పాల్గొంటూ అలరిస్తుంది. తాజాగా ఆమె తనకు ఇంగ్లీష్ రాదంటూ… చదువు, క్వాలిఫికేషన్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది దీపిక.

నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదివాను. నేను కాలేజీలో చదివేటప్పుడు ఇంకొంచం కష్టపడి చదివుంటే బాగుండేది. ఓ పెద్ద ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేసేదాన్ని. లక్షల్లో ప్యాకేజ్ తీసుకున్నదాన్ని. ఆ అవకాశం కోల్పోపోయానని బాధ ఉంది. నా లాగే చాలా మంది ఉండి ఉంటారు. చదువుకునే రోజుల్లో లాంగ్వేజ్ ప్రాబ్లమ్ కూడా ఎక్కువగా ఉండేది. నేను తమిళ్ మీడియం. కాలేజీ కి వెళ్లే సరికి అంతా ఇంగ్లీష్ మీడియం. ఇంజనీరింగ్ మొత్తం ఇంగ్లీష్ లోనే ఉండేది.

ఓ రెండు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాను. ఇంగ్లీష్ లో బేసిక్స్ తెలిసినా కూడా .. ఇంగ్లీష్ మీడియం అలవాటు పడటానికి కాస్త టైం పట్టింది. కానీ .. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే .. మనం వెళ్లాలనుకునే గమ్యం క్లియర్ గా ఉంటే .. లాంగ్వేజ్ అనేది సమస్యే కాదు అంటూ దీపిక చెప్పింది. కాగా దీపిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ తో తరచు టచ్ లో ఉంటుంది.

అలాగే ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. అందులో తనకు సంబంధించిన అన్ని విషయాలు పంచుకుంటూ వీడియోలు పోస్ట్ చేస్తుంది దీపిక. సీరియల్ కోసం వాడే మేకప్, నగలు, శారీ కలెక్షన్ కి సంబంధించిన వీడియోలు తీసి తన ఛానల్ ద్వారా ఫ్యాన్స్ కి తెలియజేస్తుంది. సీరియల్స్, షో లతో పాటు యూట్యూబ్ ద్వారా కూడా డబ్బు సంపాదిస్తుంది. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ టాప్ టీఆర్పీ దక్కించుకుంటుంది. బుల్లితెర ప్రేక్షకులకు ఫేవరెట్ సీరియల్ గా మారిపోయింది.