Bhagyashri Borse And Brahmaji: ప్రముఖ హీరోయిన్ భాగ్యశ్రీ కి యూత్ ఆడియన్స్ లో ఎంత మంచి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చేసింది నాలుగు సినిమాలే , పైగా అన్నీ అట్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి, అయినప్పటికీ కూడా ఈమెకు ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. అందుకు ముఖ్యంగా అందంగా ఉంటుంది , అద్భుతమైన టాలెంట్ ఉన్న అమ్మాయి. ఈ రెండు ఒకే చోట ఉండే హీరోయిన్స్ మన ఇండస్ట్రీ లో చాలా తక్కువ , ఆ తక్కువమంది లో ఒకరు భాగ్యశ్రీ. ఇకపోతే ఈమె హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’. అక్కినేని అఖిల్ హీరో గా నయించిన ఈ సినిమా ఈ నెల 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం ప్రొమోషన్స్ లో భాగంగా నాన్ స్టాప్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు.
ఒక ఇంటర్వ్యూ కి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన గెటప్ శ్రీను యాంకర్ గా వ్యవహరించారు. ఈ ఇంటర్వ్యూ లో హీరో అఖిల్ , హీరోయిన్ భాగ్యశ్రీ లతో పాటుగా కీలక పాత్రలు పోషించిన సీనియర్ నటులు బ్రహ్మాజీ , శివాజీ వంటి వారు కూడా పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ లో వీళ్లంతా హీరోయిన్ భాగ్యశ్రీ ని సరదాగా ర్యాగింగ్ చేశారు. సీనియర్ నటులు బ్రహ్మాజీ గురించి అందరికీ తెలిసిందే . చాలా సరదా మనిషి. తన జూనియర్స్ ని ర్యాగింగ్ చేయడం , తోటి నటీనటులపై జోకులు వేస్తూ సరదాగా గడపడం బ్రహ్మాజీ కి అలవాటు. ఈ ఇంటర్వ్యూ లో భాగ్యశ్రీ రాగానే ఆమె కాళ్లకు మొక్కుతున్నట్టుగా క్రిందకి వంగి తన ప్యాంట్ ని సరిచేసుకుంటారు బ్రహ్మాజీ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇక శివాజీ ఆమెతో తమిళం లో సంభాషిస్తారు.
అప్పుడు అఖిల్ ఆమె తమిళమ్మాయి కాదు అని అనగా , ఇప్పుడు ఆమె షూటింగ్స్ కోసం తమిళనాడు లో ఉంటుందో, తెలుగు రాష్ట్రాల్లో ఉంటుందో , లేదా కర్ణాటక లో ఉంటుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు , ప్రస్తుతం ఆమె తమిళనాడు లో సినిమా షూటింగ్ చేస్తూ ఇక్కడికి వచ్చింది కాబట్టి శివాజీ గారు అలా పలకరించారు అంటూ గెటప్ శ్రీను చెప్తారు. ఇకపోతే భాగ్యశ్రీ ఇప్పటి వరకు చేసిన ప్రతీ సినిమా పీరియడ్ బ్యాక్ డ్రాప్ కి చెందినవే అవ్వడం గమనార్హం. మిస్టర్ బచ్చన్ , కింగ్డమ్ , కాంత , ఆంధ్రా కింగ్ తాలూకా ఇలా అన్ని సినిమాలు కూడా పీరియడ్ బ్యాక్ డ్రాప్ కి చెందినవే. ఇక ఈ నెల 10 న విడుదల అవ్వబోతున్న ‘లెనిన్’ కూడా అదే బ్యాక్ డ్రాప్ కి సంబంధించిన సినిమా అట, చూడాలి మరి ఈసారి ఫలితం ఎలా ఉండబోతుంది అనేది.

