Brahma Anandya : కొన్ని సినిమాలు విడుదలకు ముందు ఆడియన్స్ దృష్టిని పెద్దగా ఆకట్టుకోవు, ఏముందిలే ఈ సినిమాలో అని చాలా తేలికగా తీసుకుంటాము, కానీ అలాంటి సినిమాలు ఒక్కోసారి బాక్స్ ఆఫీస్ వద్ద పేలుతుంటాయి, అలాంటి సినిమాలలో ఒకటి నేడు విడుదలైన ‘బ్రహ్మా ఆనందం'(Bramha Anandam) చిత్రం. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం(Bramhanandam), ఆయన తనయుడు రాజా గౌతమ్(Raja Gautham) తో కలిసి చేసిన చిత్రం నేడు గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) రావడంతో ఈ చిత్రం పై ఆడియన్స్ లో మంచి బజ్ ఏర్పడింది. ట్రైలర్ కూడా ఆకట్టుకోవడం తో టాక్ వస్తే కచ్చితంగా ఈ చిత్రాన్ని చూడాలి అనే అభిప్రాయం జనాల్లో కలిగింది. అందరూ ఊహించినట్టుగానే ఓవర్సీస్ నుండి ఈ సినిమాకి మంచి టాక్ రావడం తో, తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఊపందుకున్నాయి.
వాలెంటైన్స్ డే అనేది కేవలం ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య ఉన్న ప్రేమకి మాత్రమే చిహ్నం కాదు, ఒక తాత మనవడు మధ్య ఉన్న ప్రేమ కి కూడా చిహ్నమే. తల్లిదండ్రులు తమ బిడ్డలపై చూపించే ప్రేమ కి కూడా చిహ్నమే అనే గొప్ప సందేశాన్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ నిఖిల్. ఆద్యంతం బ్రహ్మానందం మార్క్ వింటేజ్ కామెడీ టైమింగ్ ఉంటూనే హృదయాలకు హత్తుకొనే ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఈ చిత్రం లో బాగా కుదిరాయని, కమర్షియల్ గా కచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందని అంటున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి మొదటి రోజు కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వరల్డ్ వైడ్ గా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయట. టాక్ ఇంకా వ్యాప్తి చెందితే రెండవ రోజు, మూడవ రోజు కూడా భారీ వసూళ్లు వచ్చే అవకాశం ఉంటుందని, డైరెక్టర్ చేసిన ఈ చక్కటి ప్రయత్నానికి అద్భుతమైన ఫలితం ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు.
ఈ చిత్రం బ్రహ్మానందం, రాజా గౌతమ్ లతో పాటు వెన్నెల కిషోర్ కూడా మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రని పోషించాడు. వాస్తవానికి ఈ సినిమాలో హీరోగా వెన్నెల కిషోర్ నటించాల్సి ఉందట, కానీ నాకంటే ఈ సినిమా రాజా గౌతమ్ కి బాగా సూట్ అవుతుందని, మీరు రాజా గౌతమ్ కలిసి నటించాలని నాకు స్వయంగా ఫోన్ చేసి చెప్పాడంటూ బ్రహ్మానందం మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు. ఇక రాజా గౌతమ్ కి కూడా చాలా కాలం తర్వాత ఒక మంచి కమర్షియల్ హిట్ పడిందని చెప్పొచ్చు. 2004 వ సంవత్సరం లోనే ‘పల్లకిలో పెళ్లి కూతురు’ అనే చిత్రం ద్వారా హీరో గా వెండితెర అరంగేట్రం చేసాడు రాజా గౌతమ్. ఆ తర్వాత అనేక సినిమాల్లో హీరోగా నటించాడు కానీ, కమర్షియల్ సక్సెస్ రాలేదు. మొట్టమొదటిసారి ఈ చిత్రంతో ఆయన కమర్షియల్ సక్సెస్ ని అందుకున్నాడు.