Homeఎంటర్టైన్మెంట్Brahma Anandha Movie Twitter Talk: బ్యూటిఫుల్ ఎమోషనల్ డ్రామా, ఆడియన్స్ నుండి అద్భుత రెస్పాన్స్

Brahma Anandha Movie Twitter Talk: బ్యూటిఫుల్ ఎమోషనల్ డ్రామా, ఆడియన్స్ నుండి అద్భుత రెస్పాన్స్

Brahma Anandha Movie Twitter Talk: లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం సినిమాల ఎంపిక మారింది. కమర్షియల్ చిత్రాల పట్ల పెద్దగా మక్కువ చూపడం లేదు. కామెడీకి కేర్ ఆఫ్ అడ్రెస్ గా చెప్పుకునే బ్రహ్మానందం రంగమార్తాండ వంటి ఎమోషనల్ డ్రామా చేయడం విశేషం. రంగమార్తాండ మూవీలో బ్రహ్మానందం నటన ప్రేక్షకులతో కన్నీరు పెట్టిస్తుంది. తన ఇమేజ్ కి భిన్నంగా బ్రహ్మానందం చేసిన మరొక చిత్రం బ్రహ్మా ఆనందం. కుమారుడు రాజా గౌతమ్ మరో ప్రధాన పాత్ర చేశాడు. వెన్నెల కిషోర్ కీలక రోల్ చేశాడు.

బ్రహ్మా ఆనందం చిత్రానికి VRS నిఖిల్ దర్శకుడు. ప్రియా వడ్లమాని హీరోయిన్ గా నటించింది. బ్రహ్మా ఆనందం మూవీ కథ విషయానికి వస్తే… బ్రహ్మానందం(రాజా గౌతమ్) యంగ్ టాలెంటెడ్ థియేటర్ ఆర్టిస్ట్. నటుడిగా గొప్ప స్థాయికి వెళ్లాలని కలలు కంటాడు. అయితే బ్రహ్మానందంకి ఏ పనీ పాట ఉండదు. ఉద్యోగం, సద్యోగం లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందిపడతాడు. అలాగే తన డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి డబ్బులు కోసం ప్రయత్నం చేస్తుంటాడు.

ఈ క్రమంలో అనాథశరణాలయంలో ఉంటున్న వాళ్ళ తాతయ్య మూర్తి(బ్రహ్మానందం)ని బ్రహ్మానందంని కలుస్తాడు. తన కోరిక తీరిస్తే.. పొలం అమ్మి బ్రహ్మానందం కి కావలసిన డబ్బులు ఇస్తానని మూర్తి హామీ ఇస్తాడు. మూర్తి కోరిక ఏమిటీ? బ్రహ్మానందం అది నెరవేర్చడా? తాత మనవళ్ల ప్రయాణం ఎలా సాగింది? ఎటువంటి మలుపులు తీసుకుంది? అనేది మిగతా కథ.

ట్విట్టర్ లో బ్రహ్మా ఆనందం చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ఎమోషనల్ డ్రామా ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేస్తుందని అంటున్నారు. వెన్నెల కిషోర్ కామెడీ అలరిస్తుంది. బ్రహ్మానందం, రాజా గౌతమ్ తమ నటనతో సినిమాకు ప్రధాన బలంగా నిలిచారు. దర్శకుడు నిఖిల్.. తెరకెక్కించిన ఎమోషనల్ సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా ఉన్నాయని అంటున్నారు.

స్లో నేరేషన్ తో పాటు, ఎడిటింగ్ ఒకింత నిరాశపరుస్తాయని అంటున్నారు. మొత్తంగా సినిమా మాత్రం అద్భుతంగా ఉంది. ఆడియన్స్ ఆద్యంతం మూవీని ఎంజాయ్ చేస్తారని ట్విట్టర్ టాక్ ని బట్టి అర్థం అవుతుంది. కాబట్టి ఈ వీకెండ్ కి బ్రహ్మా ఆనందం పర్ఫెక్ట్ ఛాయిస్. థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయవచ్చు.

Exit mobile version