RRR Movie: ఇండియన్ సినిమా హిస్టరీలోనే భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కిన చిత్రం రౌద్రం రణం రుధిరం. టాలీవుడ్‌లో ఓటమి ఎరుగని దర్శక ధీరుడు రాజమౌళి రూపకల్పనలో బిగ్ మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ సినిమాలో స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. ఎన్నో అంచనాల నడుమ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది.

అయితే తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో ఆర్.ఆర్.ఆర్ సినిమా ఆడుతున్న థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఒకవైపు తెలంగాణ, ఏపీలలో ఈ సినిమా చూసేందుకు టిక్కెట్లు దొరకని పరిస్థితి నెలకొంటే.. అక్కడ మాత్రం ప్రేక్షకుల నుంచి స్పందన లేకపోవడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. ఇదంతా ఎందుకని ఆరా తీస్తే రాజమౌళిపై కోపంతోనే అక్కడి ప్రజలు సినిమాను ఆదరించడం లేదని టాక్ వినిపిస్తోంది.
ఆర్.ఆర్.ఆర్ సినిమా ఐదు భాషల్లో తెరకెక్కింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందించారు. అయితే కర్ణాటకలో మాత్రం ఎక్కువ చోట్ల కన్నడ వెర్షన్‌లో విడుదల చేయకుండా తెలుగులో రిలీజ్ చేయడంపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా రిలీజ్‌కు ముందే సోషల్ మీడియాలో బ్యాన్ ఆర్.ఆర్.ఆర్ అంటూ నినాదాలతో పోస్టులు పెట్టారు.

తాజాగా సినిమా విడుదలైన తర్వాత కూడా కన్నడిగులు తమ ఆగ్రహాన్ని చూపిస్తున్నారు. కన్నడ వెర్షన్ అందుబాటులో ఉన్నా తెలుగులో విడుదల చేయడంపై వారు మండిపడుతున్నారు. అయితే తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నారనే కారణంతో తెలుగు వెర్షన్‌ను నేరుగా రిలీజ్ చేశామని డిస్ట్రిబ్యూటర్లు వివరణ ఇస్తున్నా వాటిని అక్కడి ప్రజలు పట్టించుకోవడం లేదు. దీంతో హౌస్ ఫుల్ బోర్డు పడాల్సిన థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి.
[…] Also Read: RRR Movie: అక్కడ RRR సినిమాను చూసేందుకు ముఖం చ… […]