Boycott Brahmastra: అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ సినిమాలు ఎదురు తన్నాయి. ఒక్కటంటే ఒక్కటి అయిమన్న సినిమా వస్తలేదు. థియేటర్లలో నిలబడత లేదు. స్థారాధిస్టారుల నోటి దురుసుతనం వల్ల ప్రేక్షకుల నుంచి బాయికాట్ అనే నిరసన గళం వినిపిస్తోంది. పులి మీద పుట్రలా దక్షిణాది సినిమాలు దున్నేస్తున్నాయి. వందల కోట్లను ఖాతాలో వేసుకుంటున్నయి. ఓ పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, విక్రమ్, కార్తీకేయ 2 బాలీవుడ్ కు కొత్త పాఠాలు చెబుతున్నాయి. బాలీవుడ్ ఇంతలా ఎందుకు దిగజారుతోంది అనే లోతుల్లోకి వెళ్లడం లేదు గానీ.. బాలీవుడ్ కు ఇప్పుడు ఏమాత్రం కలిసి రావడం లేదు. దీనికి బాయ్ కాట్ తోడు కావడంతో హీరోలు, నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రణ్ బీర్ కపూర్, ఆలియా జంటగా రూపొందిన బ్రహ్మాస్త్ర విడుదల కాబోతోంది. దీని బడ్జెట్ 400 కోట్లు అట! సినిమాకు సంబంధించి ప్రచారం కూడా భారీగానే చేస్తున్నారు. తెలుగులో అయితే రాజమౌళి, నాగార్జున తమ భుజాలకెత్తుకున్నారు.

రికవరీ అవుతుందా
బ్రహ్మాస్త్ర సినిమాకి 400 కోట్ల దాకా బడ్జెట్ అయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో బాయ్ కాట్ అనే ట్రెండ్ నడుస్తోంది. దీని దెబ్బకు పెద్ద పెద్ద సినిమాలే మట్టి కొట్టుకుపోయాయి. ఫలితంగా అక్షయ్ కుమార్ లాంటి హీరో తన సినిమా కట్ పుత్లీ ని నేరుగా ఓటీటీ లో రిలీజ్ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కూడా సినిమాకు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రావడం గమనార్హం. అయితే వరుస పరాజయాల నేపథ్యంలో బాలీవుడ్ కూడా బ్రహ్మాస్త్ర పైనే భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. మొదటి భాగం బ్రహ్మాస్త్ర “శివ” అనే పేరుతో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున కీలకపాత్ర పోషించారు. ఆయన పాత్ర ద్వారా టాలీవుడ్ లో మంచి వసూళ్లు రాబట్టుకోవాలని నిర్మాతలు అనుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రచార కార్యక్రమాల్లో నాగార్జున కూడా ఒక భాగం అవుతున్నారు.
Also Read: NTR vs Pawan Kalyan – BJP: ఇటు పవన్.. అటు ఎన్టీఆర్.. బీజేపీ కుడి,ఎడమల రాజకీయం?
గుడ్డిలో మెల్ల
ప్రస్తుతం బాలీవుడ్ సరైన హిట్ సినిమాలు లేక వెలవెలబోతున్నది. సినిమాల్లో సరైన మ్యాటర్ లేకపోవడంతో దక్షిణాది సినిమాలు ఆడిస్తున్నామంటూ థియేటర్ల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇటీవల లాల్ సింగ్ చద్దా అనే సినిమా విడుదలైనప్పుడు బాలీవుడ్ లో నూటికి 90% థియేటర్లలో ఆ సినిమానే ఆడించారు. కానీ సినిమాలో సరైన కథ లేకపోవడంతో విడుదలైన రెండో రోజే తిరుగు టపా కట్టింది. దీంతో ఆ థియేటర్లలో కార్తికేయ 2 సినిమాను ప్రదర్శించారు. హిందీ వాళ్లకు ఆ సినిమా బాగా నచ్చడంతో పుష్ప సినిమా స్థాయిలో వసూళ్లను దక్కించుకుంది. ఇప్పటికి చాలా ప్రాంతాల్లో హౌస్ ఫుల్ షోస్ తో రన్ అవుతోంది. అయితే ఎలాగైనా హిట్ ట్రాక్ పట్టాలని బాలీవుడ్ అనుకుంటోంది.

బాగానే త్వరలో విడుదల కాబోతున్న బ్రహ్మాస్త్ర పైనే భారీ ఆశలు పెట్టుకుంది. బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో హీరో హీరోయిన్లు ఆచితూచి మాట్లాడుతున్నారు. పైగా వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆయా హీరోలను ప్రచార కార్యక్రమాలకు వినియోగించుకుంటూ, స్థానిక భాషల్లో పాటలు పాడి అలరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్కు వచ్చినప్పుడు ఆలియా భట్ తెలుగు పాట పాడి ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. అయితే బ్రహ్మాస్త్ర అడ్వాన్స్ బుకింగ్లు ఆర్ ఆర్ ఆర్ సినిమా స్థాయిలో ఉండడంతో బాలీవుడ్ నిర్మాతలు సంబరపడుతున్నారు. ఇప్పటికే 33% దాకా బడ్జెట్ రికవరీ అయిందని చెప్తున్నారు. ఒకవేళ గనుక బ్రహ్మాస్త్ర సినిమా ప్రేక్షకులను అలరిస్తే ఈ బాయ్ కాట్ ట్రెండ్ లో బాలీవుడ్ కు ఒక పెద్ద ఉపశమనం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
[…] […]
[…] […]