Homeఎంటర్టైన్మెంట్ఆ విషయంలో బాలయ్య రేంజ్ బాగా పడిపోయింది !

ఆ విషయంలో బాలయ్య రేంజ్ బాగా పడిపోయింది !


నటసింహం బాలయ్య బాబు ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘మోనార్క్’ అనే మరో రొటీన్ యాక్షన్ కొట్టుడు సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాని ద్వారక క్రియేషన్స్‌ పతాకం పై నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే రవీందర్‌రెడ్డికి ఇప్పుడు భయం పట్టుకుంది, గత కొన్ని సినిమాలుగా బాలయ్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్లు. కనీసం ఇరవై కోట్లు కూడా కలెక్ట్ చేయలేక చేతులు ఎత్తేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాపం మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ సినిమాకి సుమారు అరవై కోట్లు ఖర్చు పెడుతున్నాడని.. బాలయ్య సినిమా పై అరవై కోట్లు వర్కౌట్ అవ్వదు అని సినిమా సన్నిహితులు చెప్పినా.. రవీందర్‌రెడ్డి బోయపాటి మీద నమ్మకంతో బడ్జెట్ విషయంలో ఎలాంటి భయం లేకుండా ఇప్పటివరకూ ముందుకు వచ్చాడు. కానీ, ఇప్పుడు బోయపాటి కూడా హీరో మార్కెట్ కంటే ఓవర్ బడ్జెట్ వద్దు అని.. ఈ విషయం బాలయ్య బాబుకు నిర్మాతగా మీరే చెప్పి ఒప్పించండని చెప్పాడట.

Also Read: అందుకే రోజా, ప్రియమణిలకు శేఖర్ మాస్టర్ దూరం !

ఉన్నట్లు ఉండి బోయపాటి ఎందుకు ఇలా చెప్పాడో అర్ధం కాక, మొత్తానికి రవీందర్‌రెడ్డి కాస్త టెన్సన్ ఫీల్ అవుతున్నాడట. ఆల్ రెడీ తరువాత షెడ్యూల్ ను హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో అక్టోబర్ ఫస్ట్ వీక్ నుండి ప్లాన్ చేశారు. ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్ ను కూడా నిర్మిస్తోన్నారు. అంతా సాఫీగా సాగుతోంది అనుకున్న టైంలో బోయపాటి ఎందుకు ఇలా చెప్పాడో అని డౌట్ లో పడ్డాడట రవీందర్‌రెడ్డి. దాంతో రచయిత అబ్బూరి రవికి ఈ సినిమా స్క్రిప్ట్ ఇచ్చి ఎలా ఉందో చెప్పమని అడిగాడట. స్క్రిప్ట్ మొత్తం చదివిన అబ్బూరి రవి ఈ సినిమా కూడా బాలయ్య రెగ్యులర్ సినిమాలు లాగే పసలేని యాక్షన్ సీన్స్ లతో, అరిగిపోయిన వార్నింగ్ డైలాగ్సేతోనే సాగుతుందని.. ఎలాంటి కొత్తదనం లేని ఈ రెగ్యులర్ యాక్షన్ డ్రామా నేటి తరం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చెప్పలేం అని రవి ఫీడ్ బ్యాక్ ఇచ్చాడట.

Also Read: రజినితో హిట్ అయితే.. సీనియర్స్ కి హీరోయిన్ దొరికినట్టే !

ఎలాగూ సినిమాని మొదలు పెట్టాం… కాబట్టి సాధ్యమైనంత తక్కువ బడ్జెట్ లో సినిమాని పూర్తి చేయాలని మిర్యాల రవీందర్‌రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చారు. మొదట ఈ సినిమాకి సుమారు అరవై కోట్లు బడ్జెట్ వేసుకున్నారు. ఇప్పుడు ఆరవై కాస్త.. ముప్పై ఐదు నుండి నలభై మధ్యలోకి వచ్చేసిందట. మొత్తానికి బడ్జెట్ విషయంలో బాలయ్య రేంజ్ బాగా పడిపోయింది. ఏది ఏమైనా ఈ డిజిటల్ జనరేషన్ లో.. బోయపాటి ఇంకా పాత చింతకాయ పచ్చడి లాంటి రివేంజ్ కథలతో.. ఓవర్ బిల్డప్ యాక్షన్ సీన్స్ తో సినిమాని చుట్టేసి.. ప్రేక్షకుల మీదకు వదిలితే.. సినిమాకి పది కోట్లు కలెక్షన్స్ రావడం కూడా కష్టమే అవుతొంది. ఆ మధ్య బోయపాటి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ఆయన చెప్పిన మాటల్లో వింటే.. ఈ సినిమా బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతుందని చెప్పుకొచ్చారు. దీనిబట్టే అర్ధం అవుతుంది.. బాలయ్య ఫ్యాన్స్ కి తప్ప మిగిలిన వారి కోసం కాదు, ఈ సినిమా అని. ఇక ఈ సినిమా తదుపరి షెడ్యూల్ లో కేవలం బాలయ్య మీద సోలో సాంగ్ ను మాత్రమే షూట్ చేయనున్నారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version