నటసింహం బాలయ్య బాబు ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘మోనార్క్’ అనే మరో రొటీన్ యాక్షన్ కొట్టుడు సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాని ద్వారక క్రియేషన్స్ పతాకం పై నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే రవీందర్‌రెడ్డికి ఇప్పుడు భయం పట్టుకుంది, గత కొన్ని సినిమాలుగా బాలయ్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్లు. కనీసం ఇరవై కోట్లు కూడా కలెక్ట్ చేయలేక చేతులు ఎత్తేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాపం మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ సినిమాకి సుమారు అరవై కోట్లు ఖర్చు పెడుతున్నాడని.. బాలయ్య సినిమా పై అరవై కోట్లు వర్కౌట్ అవ్వదు అని సినిమా సన్నిహితులు చెప్పినా.. రవీందర్‌రెడ్డి బోయపాటి మీద నమ్మకంతో బడ్జెట్ విషయంలో ఎలాంటి భయం లేకుండా ఇప్పటివరకూ ముందుకు వచ్చాడు. కానీ, ఇప్పుడు బోయపాటి కూడా హీరో మార్కెట్ కంటే ఓవర్ బడ్జెట్ వద్దు అని.. ఈ విషయం బాలయ్య బాబుకు నిర్మాతగా మీరే చెప్పి ఒప్పించండని చెప్పాడట.
Also Read: అందుకే రోజా, ప్రియమణిలకు శేఖర్ మాస్టర్ దూరం !
ఉన్నట్లు ఉండి బోయపాటి ఎందుకు ఇలా చెప్పాడో అర్ధం కాక, మొత్తానికి రవీందర్‌రెడ్డి కాస్త టెన్సన్ ఫీల్ అవుతున్నాడట. ఆల్ రెడీ తరువాత షెడ్యూల్ ను హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో అక్టోబర్ ఫస్ట్ వీక్ నుండి ప్లాన్ చేశారు. ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్ ను కూడా నిర్మిస్తోన్నారు. అంతా సాఫీగా సాగుతోంది అనుకున్న టైంలో బోయపాటి ఎందుకు ఇలా చెప్పాడో అని డౌట్ లో పడ్డాడట రవీందర్‌రెడ్డి. దాంతో రచయిత అబ్బూరి రవికి ఈ సినిమా స్క్రిప్ట్ ఇచ్చి ఎలా ఉందో చెప్పమని అడిగాడట. స్క్రిప్ట్ మొత్తం చదివిన అబ్బూరి రవి ఈ సినిమా కూడా బాలయ్య రెగ్యులర్ సినిమాలు లాగే పసలేని యాక్షన్ సీన్స్ లతో, అరిగిపోయిన వార్నింగ్ డైలాగ్సేతోనే సాగుతుందని.. ఎలాంటి కొత్తదనం లేని ఈ రెగ్యులర్ యాక్షన్ డ్రామా నేటి తరం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చెప్పలేం అని రవి ఫీడ్ బ్యాక్ ఇచ్చాడట.
Also Read: రజినితో హిట్ అయితే.. సీనియర్స్ కి హీరోయిన్ దొరికినట్టే !
ఎలాగూ సినిమాని మొదలు పెట్టాం… కాబట్టి సాధ్యమైనంత తక్కువ బడ్జెట్ లో సినిమాని పూర్తి చేయాలని మిర్యాల రవీందర్‌రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చారు. మొదట ఈ సినిమాకి సుమారు అరవై కోట్లు బడ్జెట్ వేసుకున్నారు. ఇప్పుడు ఆరవై కాస్త.. ముప్పై ఐదు నుండి నలభై మధ్యలోకి వచ్చేసిందట. మొత్తానికి బడ్జెట్ విషయంలో బాలయ్య రేంజ్ బాగా పడిపోయింది. ఏది ఏమైనా ఈ డిజిటల్ జనరేషన్ లో.. బోయపాటి ఇంకా పాత చింతకాయ పచ్చడి లాంటి రివేంజ్ కథలతో.. ఓవర్ బిల్డప్ యాక్షన్ సీన్స్ తో సినిమాని చుట్టేసి.. ప్రేక్షకుల మీదకు వదిలితే.. సినిమాకి పది కోట్లు కలెక్షన్స్ రావడం కూడా కష్టమే అవుతొంది. ఆ మధ్య బోయపాటి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ఆయన చెప్పిన మాటల్లో వింటే.. ఈ సినిమా బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతుందని చెప్పుకొచ్చారు. దీనిబట్టే అర్ధం అవుతుంది.. బాలయ్య ఫ్యాన్స్ కి తప్ప మిగిలిన వారి కోసం కాదు, ఈ సినిమా అని. ఇక ఈ సినిమా తదుపరి షెడ్యూల్ లో కేవలం బాలయ్య మీద సోలో సాంగ్ ను మాత్రమే షూట్ చేయనున్నారు.