https://oktelugu.com/

తెలంగాణ లంచావతారుల మీద అనకొండలు

ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా.. ఎన్ని వ్యవస్థలు రద్దు చేస్తున్నా.. ఏ స్థాయిలో పనిష్‌మెంట్లు ఇస్తున్నా.. తెలంగాణ రాష్ట్రంలో లంచాలు మాత్రం ఆగడం లేదు. పేదలను జలగల్లా పీక్కుతింటూనే ఉన్నారు. మొన్నటి వరకు వేల నుంచి లక్షకు చేరుకున్నా ఆ లంచాలు.. ఇప్పుడు కోటికి పడగలెత్తాయి. కొడితే కుంభాన్ని కొట్టాలనుకుంటున్నట్లు ఉన్నారు ఈ ఆఫీసర్లు. అందుకే చిన్నచిన్న సెటిల్‌మెంట్లకు కాకుండా పెద్దవాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవల కీసర తహసీల్దార్‌‌ విషయంలో అదే రుజువైంది. అది జరిగి […]

Written By:
  • NARESH
  • , Updated On : September 10, 2020 / 02:48 PM IST

    coruption in telangana

    Follow us on

    ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా.. ఎన్ని వ్యవస్థలు రద్దు చేస్తున్నా.. ఏ స్థాయిలో పనిష్‌మెంట్లు ఇస్తున్నా.. తెలంగాణ రాష్ట్రంలో లంచాలు మాత్రం ఆగడం లేదు. పేదలను జలగల్లా పీక్కుతింటూనే ఉన్నారు. మొన్నటి వరకు వేల నుంచి లక్షకు చేరుకున్నా ఆ లంచాలు.. ఇప్పుడు కోటికి పడగలెత్తాయి. కొడితే కుంభాన్ని కొట్టాలనుకుంటున్నట్లు ఉన్నారు ఈ ఆఫీసర్లు. అందుకే చిన్నచిన్న సెటిల్‌మెంట్లకు కాకుండా పెద్దవాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవల కీసర తహసీల్దార్‌‌ విషయంలో అదే రుజువైంది. అది జరిగి నెల రోజులైనా కాకముందే బుధవారం మరో సెన్షేషనల్‌ విషయం బయటపడింది. ఏకంగా అడిషనల్‌ కలెక్టర్‌‌ అసైన్డ్‌ భూముల క్లియరెన్స్‌ కోసం ఏకంగా రూ.1.12 కోట్లు డిమాండ్‌ చేశాడు. రూ.40 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

    Also Read: మాటల కోటలు.. చర్యలేవి కేసీఆర్ సార్

    అయితే.. ఈ కేసులను పరిశీలిస్తే ఇంత పెద్ద డీల్‌ ఏ ఒక్కరిద్దరితో సాధ్యపడేది కాదు. పైన చెప్పిన రెండు కేసుల్లోనూ వారితోపాటు.. వారి పైస్థాయి ఆఫీసర్ల హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తతంగం వెనుక పెద్ద తలకాయలు పేర్లు కూడా బయటికి వచ్చాయి. అయితే వారు రాజకీయ నేతలు కాదు. ఉన్నతాధికారులే. కీసర ఎమ్మార్వో నాగరాజు వ్యవహారంలో ఓ కలెక్టర్ తీరు వివాదాస్పదమైంది. ఆయనకు నాగరాజు ఓ ఫార్మ్ హౌస్ కూడా కొనిచ్చాడని చెబుతున్నారు. కానీ.. ఆ వివరాలేవీ ఇంకా బయటకు రాలేదు.

    అయితే.. ఈ కేసులో నగేష్‌తోపాటు ఆర్డీవో అరుణ, నర్సాపూర్‌ ఎమ్మార్వో మాలతి, వీఆర్‌ఏ, వీఆర్వోలు సహా 12 మంది ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఉప్పల్‌లోని ఆర్డీవో అరుణ ఇంట్లో రూ.26 లక్షలు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. కానీ అసలు ఆ భూమి పూర్వపరాలు.. ఇప్పటి వరకూ జరిగిన వ్యవహారాల గురించి మాత్రం దర్యాప్తు చేయలేదు. ఈ విషయంలో ఉన్నతాధికారుల తీరుపైనా అనుమానాలు కలుగుతున్నాయి. భూమికి ఎన్వోసీ ఇవ్వడానికి ఎకరానికి లక్ష చొప్పున లంచం బేరంగా మాట్లాడుకున్నారు.అయితే ఆ భూములపై అంతకుముందు రిజిస్ట్రేషన్ చేయకూడదనే ఉత్తర్వులు ఉన్నాయి. వాటిని తొలగించడానికి ఉత్తర్వులు వచ్చినా తొక్కి పెట్టారు. వాటిని ఎలా తొక్కిపెట్టారనే దానిపై చర్చ జరుగుతోంది. అయితే రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన వాళ్లే దొంగలు తప్ప.. మిగతా వెనుక ఉండేవారంతా  తప్పించుకోగలిగిన వాళ్లేనని సమాచారం.

    Also Read: ఆ తెలంగాణ జైత్రయాత్రకు 42 ఏళ్లు

    ఈ కేసుల్లో ఉన్నతాధికారులు అంటే సహజంగానే ప్రభుత్వంలో కీలకమై ఉంటారు. వారు తమపై విచారణల వరకూ రాకుండా.. మేనేజ్‌ చేసుకోగలరు. ఆ స్థాయిలో ఉన్న వారు ఆ మాత్రం తప్పించుకునే ఆస్కారం లేకుండాపోలేదు. అందుకే.. కీసర ఎమ్మార్వో విషయంలో ఓ కలెక్టర్ ఫార్మ్ హౌస్ గురించి వెలుగులోకి వచ్చినా.. ఎలాంటి స్పందన లేదు. మెదక్ అడిషనల్ కలెక్టర్ విషయంలోనూ అంతే కావొచ్చు. అసలు వెనుకాల ఉన్న దొంగలు పట్టుబడుతారా అనే ప్రశ్నలు అందరిలోనూ కనిపిస్తున్నాయి.