Boyapati Srinu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ దర్శకుడి గా మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను. ప్రతి దర్శకుడికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇక బోయపాటి మాత్రం మాస్, యాక్షన్ ఎపిసోడ్స్ ని భారీగా పెట్టి సక్సెస్ లను కొడుతూ ఉంటాడు. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో మాత్రం ఊర మాస్ సినిమాలు వస్తుంటాయి. ఇక బాలయ్య బాబు అభిమానులను టార్గెట్ చేసి సినిమాలు చేయడం లో ఆయనని మించిన వారు ఎవరు లేరు అనేది వాస్తవం.
అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బోయపాటి శ్రీను పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. మీరు పవన్ కళ్యాణ్ తో సినిమా ఎప్పుడు చేస్తారు అని యాంకర్ అడిగితే దానికి సమాధానంగా బోయపాటి నేను పవన్ కళ్యాణ్ తో సినిమా చేయలేను, ఎందుకంటే ఆయన తక్కువ రోజుల్లో సినిమా చేసేస్తాడు. నేను ఒక సినిమా చేయాలంటే హీరో దగ్గర ఎక్కువ డేట్స్ తీసుకుంటాను అలా అయితేనే సినిమా క్లారిటీగా వస్తుంది. కాబట్టి ఇప్పుడున్న రోజుల్లో అయితే పవన్ కళ్యాణ్ తో నేను సినిమా చేయలేను అంటూ క్లారిటీగా చెప్పేశాడు.
ఇక ఇది చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు బోయపాటి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయకపోవడమే బెటర్ ఎందుకంటే ఆయన రొటీన్ స్టోరీలకి పవన్ కళ్యాణ్ సెట్ అవ్వడు, అలాగే ఆ మాస్ ఎలివేషన్స్, ఆ యాక్షన్ ఎపిసోడ్స్ తో పవన్ కళ్యాణ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. బోయపాటికి బాలయ్య అయితేనే పక్క గా సెట్ అవుతుంది, బాలయ్య బాబు గుద్దితే గాలిలో ఇద్దరు, ముగ్గురు ఎగిరి పడడాలు,తంతే కారు బోల్తా కొట్టడాలు లాంటి సీన్లు బాలయ్య బాబుకి అయితేనే బాగా సెట్ అవుతాయి.
మిగతా ఏ హీరోకి సెట్ అవ్వవు అంటూనే అది కూడా బోయపాటి తీస్తేనే బాలయ్య బాబుకి సెట్ అవుతాయంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే బోయపాటి పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ప్రసక్తే లేదు అని కరకండి గా చెప్పేశాడు. ఇక ప్రస్తుతం బోయపాటి బాలయ్యతో మరో సినిమా చేయడానికి రంగం సిద్దం చేస్తున్నాడు. రామ్ తో చేసిన స్కంద సినిమా పెద్దగా ఆకట్టుకోనప్పటికీ బాలయ్య బాబుతో చేసే సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించాలని చూస్తున్నాడు.