Balayya and Boyapati : ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలామంది నటులు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళకంటు మంచి గుర్తింపును సంపాదించుకుంటు ముందుకు దూసుకెళ్తున్న సీనియర్ హీరోలు సైతం వరస సక్సెస్ లను సాధిస్తూ వాళ్ళకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకుంటున్నారు… ఇక బాలయ్య బాబు అయితే వరుసగా నాలుగు సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించి ఆయన కంటూ ఒక సెపరేట్ ఇమేజ్ ని కూడా కట్టబెట్టుకున్నాడు…
సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. వాళ్ల కాంబినేషన్ ఎలాంటి సినిమా వచ్చినా కూడా ప్రేక్షకులు ఆదరించడానికి సిద్ధంగా ఉంటారు. ఇక అలాంటి కాంబినేషనే బాలయ్య బోయపాటి శ్రీను కాంబో…వీళ్లిద్దరూ కలిసి ఇప్పటివరకు మూడు సినిమాలు చేశారు. ఆ మూడు సినిమాలు కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెట్టాయి… ఇక ఇప్పుడు చేస్తున్న ‘అఖండ 2’ సినిమాతో మరోసారి భారీ విజయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న వీళ్ళిద్దరూ వాళ్లను వాళ్ళు స్టార్లు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మాత్రం అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబుకి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనతో సినిమాలు చేయడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు సైతం పోటీ పడుతున్నారని చెప్పడంలో అంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ఇప్పటికే బాలయ్య ఈ సంవత్సరం ‘డాకు మహారాజ్’ (Daaku Maharaj) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక అఖండ(Akhanda) సినిమాని కూడా ఈ సంవత్సరంలో రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యం లో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది…
మరి ఏది ఏమైనా కూడా బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందంటూ యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా బోయపాటి శ్రీను మాట్లాడుతూ మా ఇద్దరి కాంబినేషన్ ఇక ఎన్ని సినిమాలు వస్తాయి అనేది ప్రేక్షకులు ఊహించలేరు.
ఆ రేంజ్ లో మేము సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాము అంటూ కొన్ని కామెంట్లైతే చేశాడు. ఇక మొత్తానికైతే బోయపాటి బాలయ్య కాంబినేషన్ తర్వాత కూడా ప్రేక్షకులందరిని మెప్పించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటికే కమర్షియల్ సినిమా డైరెక్టర్లతో వరుస సినిమాలను చేస్తున్న బాలయ్య అఖండ 2 (Akhanda 2)సినిమా తర్వాత కూడా మరోసారి బోయపాటితో సినిమా చేయడానికి సన్నాహాలు కూడా చేసుకుంటున్నాడట. మరి ఏది ఏమైనా కూడా ఇతర దర్శకులతో సినిమాలు చేసుకుంటూ ముందుకెళుతున్న బాలయ్య మధ్య మధ్యలో బోయపాటితో సినిమా చేసి ఒక బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని అందుకుంటున్నాడు. ఇక యంగ్ డైరెక్టర్ల తో కూడా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…