https://oktelugu.com/

Ram Pan India Film: హీరో రామ్ ప్యాన్ ఇండియా మూవీ.. దర్శకుడెవరో తెలుసా?

Ram Pan India Film : బాహుబలి సినిమాతో తెలుగు సినిమాలకు క్రేజ్ వచ్చింది. ప్యాన్ ఇండియా సామర్థ్యం వచ్చింది. ఒక్క రాజమౌళి-ప్రభాస్ దెబ్బకు ఇప్పుడు అందరు హీరోలు ప్యాన్ ఇండియా జపం చేస్తున్నారు. తమ మార్కెట్ ను పెంచుకుంటున్నారు. ఆడుతుందా? తమకు అంత శక్తిసామర్థ్యాలున్నాయా? అన్న దానిపై సంబంధం లేకుండానే ‘ప్యాన్ ఇండియా ’ పిచ్చి ఇప్పుడు తెలుగు సినీ ప్రముఖులకు ఎక్కేసింది. తాజాగా మరో టాలీవుడ్ హీరో ప్యాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుట్టాడు. […]

Written By: , Updated On : August 30, 2021 / 05:10 PM IST
Follow us on

Boyapati Sreenu to direct Ram Pothineni

Ram Pan India Film : బాహుబలి సినిమాతో తెలుగు సినిమాలకు క్రేజ్ వచ్చింది. ప్యాన్ ఇండియా సామర్థ్యం వచ్చింది. ఒక్క రాజమౌళి-ప్రభాస్ దెబ్బకు ఇప్పుడు అందరు హీరోలు ప్యాన్ ఇండియా జపం చేస్తున్నారు. తమ మార్కెట్ ను పెంచుకుంటున్నారు. ఆడుతుందా? తమకు అంత శక్తిసామర్థ్యాలున్నాయా? అన్న దానిపై సంబంధం లేకుండానే ‘ప్యాన్ ఇండియా ’ పిచ్చి ఇప్పుడు తెలుగు సినీ ప్రముఖులకు ఎక్కేసింది.

తాజాగా మరో టాలీవుడ్ హీరో ప్యాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుట్టాడు. టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ (Hero Ram) గత కొంతకాలంగా టాప్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Srinu)తో ఒక సినిమా తీయాలని చర్చలు జరుపుతున్నారు. గత కొన్ని నెలల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రెండు వైపుల నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

తాజా అప్డేట్ ప్రకారం.. రామ్ హీరోగా ఊర మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కినట్టు సమాచారం. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలల్లో ద్విభాష చిత్రంగా రూపొందిస్తున్నారట.. మిర్యాల రవీందర్ రెడ్డి, శ్రీనివాస చిట్టూరి ఈ హైఓల్టేజ్ మాస్ ఎంటర్ టైనర్ కు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం హీరో రామ్.. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసిన తర్వాత వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది.

ప్రస్తుతం బోయపాటి శ్రీను అగ్రహీరో బాలయ్యతో ‘అఖండ’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘అఖండ’ మూవీని దసరాకు రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. విడుదల తేదీ ప్రకటించాల్సి ఉంది.

అయితే బోయపాటి శ్రీను ఇప్పటికే దక్షిణాది హీరోలు సూర్య, యష్ తో సినిమాల కోసం చర్చలు జరిపినా అవి పట్టాలెక్కలేదు. అతడి తదుపరి చిత్రాల నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ప్రస్తుతానికి రామ్ తో మూవీ ఖాయమైనట్టు తెలిసింది.